ఇంతి యదె నీ విదె యేమనేము నేమెల్లా
(॥పల్లవి॥)
ఇంతి యదె నీ విదె యేమనేము నేమెల్లా
చింతలెల్లాఁ బాసెను నీచిత్త మింతే యిఁకను
(॥ఇంతి॥)
తలఁపెల్లాఁ దమకమే తనువెల్లాఁ జెమటలే
నెలఁత కెంతమోహమో నీమీఁదను
పిలిచినప్పుడు రాక బిగిసి యిప్పుడు వచ్చి
చెలరేఁగి నవ్వేవు నీచిత్తమింతే యిఁకను
(॥ఇంతి॥)
చూపులెల్లా నివ్వెరగే సుద్దులెల్లా నీకతలే
యీపడఁతి కెంతాసో యిటు నీమీఁద
రేపకాక రచ్చసేసి రేతిరి యీపె దగ్గరి
చేపట్టితి వింతలో నీచిత్తమింతే యిఁకను
(॥ఇంతి॥)
చెక్కులెల్లాఁ బులకలే సెలవులెల్లా సిగ్గులే
అక్కరెంతో కాఁగిటిలో నాపె నీమీఁద
గక్కన శ్రీవేంకటేశ కలసితివి కాంతను
చిక్కనాయ ననుపు నీచిత్తమింతే యిఁకను
(||pallavi||)
iṁti yadĕ nī vidĕ yemanemu nemĕllā
siṁtalĕllām̐ bāsĕnu nīsitta miṁte yim̐kanu
(||iṁti||)
talam̐pĕllām̐ damagame tanuvĕllām̐ jĕmaḍale
nĕlam̐ta kĕṁtamohamo nīmīm̐danu
pilisinappuḍu rāga bigisi yippuḍu vachchi
sĕlarem̐gi navvevu nīsittamiṁte yim̐kanu
(||iṁti||)
sūbulĕllā nivvĕrage suddulĕllā nīgadale
yībaḍam̐ti kĕṁtāso yiḍu nīmīm̐da
rebagāga rachchasesi rediri yībĕ daggari
sebaṭṭidi viṁtalo nīsittamiṁte yim̐kanu
(||iṁti||)
sĕkkulĕllām̐ bulagale sĕlavulĕllā siggule
akkarĕṁto kām̐giḍilo nābĕ nīmīm̐da
gakkana śhrīveṁkaḍeśha kalasidivi kāṁtanu
sikkanāya nanubu nīsittamiṁte yim̐kanu