Imti vubasaarabooja yimde kalige neegu

ఇంతి వుపచారపూజ యిందే కలిగె నీకు
Language

(॥పల్లవి॥)
ఇంతి వుపచారపూజ యిందే కలిగె నీకు
వంతులఁ జేకొని నీవు వరమియ్యవయ్యా

(॥ఇంతి॥)
అంగన నిన్నుఁజూచుటే అవాహనము, ఆకెకు
ఆంగవించి నీవు మతి హత్తినదే ఆసనము,
సంగతి నీపైచింతే సదా ధ్యానముసుమ్మీ,
అంగపుఁ జెక్కచెమటలు లర్ఘ్యపాద్యాదులు

(॥ఇంతి॥)
సరుసఁ గన్నీళ్లే ఆచమనము జలకము,
అరవిరి పయ్యదము అంగవస్త్రము,
నిరతి మైకమ్మఁదావి నీకునిచ్చినగంధాలు,
పరగినపులకలే పలుపూజలు

(॥ఇంతి॥)
దొమ్మివూర్పు విరహగ్నిదూపము దీపము నాయ,
సోమ్ములే మైమెఱుగులు, సోలి వీఁగేవే దండాలు,
నమ్మిక శ్రీవేంకటేశ నై వేద్యమాయ మోవి,
కమ్మరఁ గాంగిటినవ్వే కప్పురపువిడేలు

(||pallavi||)
iṁti vubasārabūja yiṁde kaligĕ nīgu
vaṁtulam̐ jegŏni nīvu varamiyyavayyā

(||iṁti||)
aṁgana ninnum̐jūsuḍe avāhanamu, āgĕgu
āṁgaviṁchi nīvu madi hattinade āsanamu,
saṁgadi nībaisiṁte sadā dhyānamusummī,
aṁgabum̐ jĕkkasĕmaḍalu larghyabādyādulu

(||iṁti||)
sarusam̐ gannīḽle āsamanamu jalagamu,
araviri payyadamu aṁgavastramu,
niradi maigammam̐dāvi nīgunichchinagaṁdhālu,
paraginabulagale palubūjalu

(||iṁti||)
dŏmmivūrbu virahagnidūbamu dībamu nāya,
sommule maimĕṟugulu, soli vīm̐geve daṁḍālu,
nammiga śhrīveṁkaḍeśha nai vedyamāya movi,
kammaram̐ gāṁgiḍinavve kappurabuviḍelu