ఇంతి వొయ్యారంబు లివి నీకు నడ్డమా
(॥పల్లవి॥)
ఇంతి వొయ్యారంబు లివి నీకు నడ్డమా
సంతతపు వేడుకలు సలుపవలెఁ గాక
(॥ఇంతి॥)
సతమైన కాఁగిటికి చనుఁగొండ లడ్డమా
ఇతవులై మనసు లెనయించుఁగాక
రతివేళ చేఁతలకు రాజసము లడ్డమా
కతలుగా మర్మములు గరఁగించుఁగాక
(॥ఇంతి॥)
పెనఁగులాటలకు మరి పెనుసిగ్గు లడ్డమా
చెనకించి సదమదము సేయుఁగాక
మొనయుఁ గనుచూపులకు మొరఁగులవి యడ్డమా
చొనిపి కందువలెల్ల సోదించుఁగాక
(॥ఇంతి॥)
నిండుఁ గూటంబులకు నివ్వెరగు లడ్డమా
రెండు వంకలనుఁ దమి రేఁచుఁగాక
అండనే శ్రీవేంకటాద్రీశ కూడితివి
వెండియును మీమేలు వెలయవలెఁగాక
(||pallavi||)
iṁti vŏyyāraṁbu livi nīgu naḍḍamā
saṁtadabu veḍugalu salubavalĕm̐ gāga
(||iṁti||)
sadamaina kām̐giḍigi sanum̐gŏṁḍa laḍḍamā
idavulai manasu lĕnayiṁchum̐gāga
radiveḽa sem̐talagu rājasamu laḍḍamā
kadalugā marmamulu garam̐giṁchum̐gāga
(||iṁti||)
pĕnam̐gulāḍalagu mari pĕnusiggu laḍḍamā
sĕnagiṁchi sadamadamu seyum̐gāga
mŏnayum̐ ganusūbulagu mŏram̐gulavi yaḍḍamā
sŏnibi kaṁduvalĕlla sodiṁchum̐gāga
(||iṁti||)
niṁḍum̐ gūḍaṁbulagu nivvĕragu laḍḍamā
rĕṁḍu vaṁkalanum̐ dami rem̐sum̐gāga
aṁḍane śhrīveṁkaḍādrīśha kūḍidivi
vĕṁḍiyunu mīmelu vĕlayavalĕm̐gāga