Imti voodigabuvaara memtainaa gaddu pani

ఇంతి వూడిగపువార మెంతైనా గద్దు పని
Language

(॥పల్లవి॥)
ఇంతి వూడిగపువార మెంతైనా గద్దు పని
అంత కలిగితే నీవే ఆడకు రావయ్యా

(॥॥)
వెలఁది మాటలు నీకు విన్నపము సేసితిమి
అలరి మఱచు మాట లానతీవయ్యా
నెలకొని వాకిటనే నిలుచున్నది మారాక
తలఁచి తడవైతేను తానే వచ్చునేమో

(॥॥)
అంది నీ కిచ్చితి మిప్పు డాకె వంపిన లేకలు
అందులోనే వున్నవి ఆపను లెల్లా
అందలము వట్టు మనే నప్పుడే తమకించీ
ముందుగాఁ జెప్పవలె నీ మోహము లాపెకును

(॥॥)
కానికె నీ కిచ్చితిమి కంటిమి నీ పాదాలు
తానూ వచ్చెను నీ ముందరికిఁ జెలి
ఆనుక శ్రీ వేంకటేశ ఆపే నీవూఁ గూడితిరి
పూని వచ్చిన మా సేవ పొందుగా నీడేరెనూ

(||pallavi||)
iṁti vūḍigabuvāra mĕṁtainā gaddu pani
aṁta kaligide nīve āḍagu rāvayyā

(||||)
vĕlam̐di māḍalu nīgu vinnabamu sesidimi
alari maṟasu māḍa lānadīvayyā
nĕlagŏni vāgiḍane nilusunnadi mārāga
talam̐si taḍavaidenu tāne vachchunemo

(||||)
aṁdi nī kichchidi mippu ḍāgĕ vaṁpina legalu
aṁdulone vunnavi ābanu lĕllā
aṁdalamu vaṭṭu mane nappuḍe tamagiṁchī
muṁdugām̐ jĕppavalĕ nī mohamu lābĕgunu

(||||)
kānigĕ nī kichchidimi kaṁṭimi nī pādālu
tānū vachchĕnu nī muṁdarigim̐ jĕli
ānuga śhrī veṁkaḍeśha ābe nīvūm̐ gūḍidiri
pūni vachchina mā seva pŏṁdugā nīḍerĕnū