ఇంతి విరహము మాన్ప నిదె వుపాయము
(॥పల్లవి॥)
ఇంతి విరహము మాన్ప నిదె వుపాయము
దొంతి కత చెప్పరే సంతోసించుఁ గాని
(॥ఇంతి॥)
కలువలు కొప్పనిండా కాంతకు ముడువరే
అలచందురుఁడు చుట్టమై యుండుఁగాని
తలకొని మేన గందము చాలాఁ బూయరే
మలయానిలుఁ డీకెను మన్నీంచుఁగాని
(॥ఇంతి॥)
భామ వురమున రవి పడ(ద?)కము వెట్టరే
భూమిఁ జక్రవాకాలెల్లా పొందౌఁగాని
చేముందుగాఁ గమలాలచీర గట్టుకోనియ్యరే
ఆమని తుమ్మిదలు సహాయమౌఁగాని
(॥ఇంతి॥)
వనిత చేతికి పంచవన్నె చిలుక నియ్యరే
తనిసి మరుఁడు దయదలఁచుఁగాని
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలో నీకెను నేఁడు
దినమూ నిట్టె సేయరే తిరమై యుండుఁగాని
(||pallavi||)
iṁti virahamu mānpa nidĕ vubāyamu
dŏṁti kada sĕppare saṁtosiṁchum̐ gāni
(||iṁti||)
kaluvalu kŏppaniṁḍā kāṁtagu muḍuvare
alasaṁdurum̐ḍu suṭṭamai yuṁḍum̐gāni
talagŏni mena gaṁdamu sālām̐ būyare
malayānilum̐ ḍīgĕnu mannīṁchum̐gāni
(||iṁti||)
bhāma vuramuna ravi paḍa(da?)kamu vĕṭṭare
bhūmim̐ jakravāgālĕllā pŏṁdaum̐gāni
semuṁdugām̐ gamalālasīra gaṭṭugoniyyare
āmani tummidalu sahāyamaum̐gāni
(||iṁti||)
vanida sedigi paṁchavannĕ siluga niyyare
tanisi marum̐ḍu dayadalam̐sum̐gāni
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo nīgĕnu nem̐ḍu
dinamū niṭṭĕ seyare tiramai yuṁḍum̐gāni