Imti taam jegonnave yinniyum dolli

ఇంతి తాఁ జేకొన్నవే యిన్నియుఁ దొల్లి
Language

(॥పల్లవి॥)
ఇంతి తాఁ జేకొన్నవే యిన్నియుఁ దొల్లి
చెంతల నేఁడాపెఁ జేరి చిత్తగించె నిదివో

(॥ఇంతి॥)
పొలఁతి నిన్ను మొగ్గల బూజ సేసెఁ గాన తొల్లి
పులక మొగ్గలు మేనఁ బొదవె నేఁడు
చెలఁగి నీలాల నీపై సేస వెట్టెఁగాన నేడు
నిలువున దిగజారి నెరు లున్నవి

(॥ఇంతి॥)
వనిత పన్నీట నీపై వంతము చల్లెఁగాన
అనుఁగుఁ జెమటలపాలాయ నిపుడు
మునుప నిన్నింత ఆపె ముట్టి వలపంచెఁగాన
పనివడి నేఁడు నీపై భ్రమ నున్నది

(॥ఇంతి॥)
కాఁగిట నిన్నా ఆపె దొల్లి కడుఁ గరఁగించెఁగాన
చేఁగదేర విరహనఁ జిక్కె మేనెల్లా
వీఁగక కూడితివి శ్రీ వేంకటేశ సతి నిట్టే
మూఁగినంతోషములు మొదలు కొనినవి

(||pallavi||)
iṁti tām̐ jegŏnnave yinniyum̐ dŏlli
sĕṁtala nem̐ḍābĕm̐ jeri sittagiṁchĕ nidivo

(||iṁti||)
pŏlam̐ti ninnu mŏggala būja sesĕm̐ gāna tŏlli
pulaga mŏggalu menam̐ bŏdavĕ nem̐ḍu
sĕlam̐gi nīlāla nībai sesa vĕṭṭĕm̐gāna neḍu
niluvuna digajāri nĕru lunnavi

(||iṁti||)
vanida pannīḍa nībai vaṁtamu sallĕm̐gāna
anum̐gum̐ jĕmaḍalabālāya nibuḍu
munuba ninniṁta ābĕ muṭṭi valabaṁchĕm̐gāna
panivaḍi nem̐ḍu nībai bhrama nunnadi

(||iṁti||)
kām̐giḍa ninnā ābĕ dŏlli kaḍum̐ garam̐giṁchĕm̐gāna
sem̐gadera virahanam̐ jikkĕ menĕllā
vīm̐gaga kūḍidivi śhrī veṁkaḍeśha sadi niṭṭe
mūm̐ginaṁtoṣhamulu mŏdalu kŏninavi