ఇంతి చూచి యేమనెనో యెంత భ్రమసితినంటా
(॥పల్లవి॥)
ఇంతి చూచి యేమనెనో యెంత భ్రమసితినంటా
కంతుని మాయలవుత గాననైతినే
(॥ఇంతి॥)
వెన్నెల గాయఁగఁ జూచి వెలఁది నవ్వెనోయంటా
పన్ని నే మారుకుమారు పతి నవ్వితినే
కన్నెచకోరాలఁ జూచి కన్నులఁ జూచెనోయంటా
మన్ననచూపుల నేను మారు చూచితినే
(॥ఇంతి॥)
కోవిల గూయఁగ విని కొమ్మ మాటాడెనోయంటా
వోవల మారుకుమారు వూఁకొంటినే
పూవులు మాఁకుల రాలఁ బొలఁతిసేసలోయంటా
యీవలఁ గమ్మర నవే ఇటు చల్లితినే
(॥ఇంతి॥)
చల్లగాని విసరఁగా సతినిట్టూర్పులోయంటా
వుల్లపుసంతసమున నొనరితినే
మెల్లనె శ్రీవేంకటాద్రిమీఁదనె నే నుండఁగాను
వొల్లనె చెలియ వచ్చి వూరడించి కూడెనే
(||pallavi||)
iṁti sūsi yemanĕno yĕṁta bhramasidinaṁṭā
kaṁtuni māyalavuda gānanaidine
(||iṁti||)
vĕnnĕla gāyam̐gam̐ jūsi vĕlam̐di navvĕnoyaṁṭā
panni ne mārugumāru padi navvidine
kannĕsagorālam̐ jūsi kannulam̐ jūsĕnoyaṁṭā
mannanasūbula nenu māru sūsidine
(||iṁti||)
kovila gūyam̐ga vini kŏmma māḍāḍĕnoyaṁṭā
vovala mārugumāru vūm̐kŏṁṭine
pūvulu mām̐kula rālam̐ bŏlam̐tisesaloyaṁṭā
yīvalam̐ gammara nave iḍu sallidine
(||iṁti||)
sallagāni visaram̐gā sadiniṭṭūrbuloyaṁṭā
vullabusaṁtasamuna nŏnaridine
mĕllanĕ śhrīveṁkaḍādrimīm̐danĕ ne nuṁḍam̐gānu
vŏllanĕ sĕliya vachchi vūraḍiṁchi kūḍĕne