ఇంతి సింగారము నేడు యెట్టున్నది
(॥పల్లవి॥)
ఇంతి సింగారము నేడు యెట్టున్నది
కంతుని దీమము రూపై కలిగినట్లాయ
(॥ఇంతి॥)
నివ్వటిల్లుతురుములో నెలఁతముడిచినట్టి -
యివ్వలఁ గమ్మవిరు లెట్టున్నవి
పువ్వుఁదేనె లంటిరాఁగా పువ్వులెల్ల తుమ్మిదల
అవ్వల వెంటనే వచ్చి అనినట్లాయ
(॥ఇంతి॥)
కందువకుచములపై కామిని పూసినయట్టి -
యిందులో గందపుఁబూత లెట్టున్నవి
చందురుని వెన్నెలలు జక్కనలు సారెదాఁగె
అందుకే వెన్నెలలెల్ల అనినయట్లాయ
(॥ఇంతి॥)
శ్రీవేంకటేశ్వరుఁడు చెలిఁగూడేరతివేళ
యీవల మోవిగుఱుతు లెట్లున్నవి
దేవుఁ డితనికి మీఁదెత్తినయమృతముకోని
వేవేలు ముద్రలు పయివేసినయట్లాయ
(||pallavi||)
iṁti siṁgāramu neḍu yĕṭṭunnadi
kaṁtuni dīmamu rūbai kaliginaṭlāya
(||iṁti||)
nivvaḍilludurumulo nĕlam̐tamuḍisinaṭṭi -
yivvalam̐ gammaviru lĕṭṭunnavi
puvvum̐denĕ laṁṭirām̐gā puvvulĕlla tummidala
avvala vĕṁṭane vachchi aninaṭlāya
(||iṁti||)
kaṁduvagusamulabai kāmini pūsinayaṭṭi -
yiṁdulo gaṁdabum̐būda lĕṭṭunnavi
saṁduruni vĕnnĕlalu jakkanalu sārĕdām̐gĕ
aṁduge vĕnnĕlalĕlla aninayaṭlāya
(||iṁti||)
śhrīveṁkaḍeśhvarum̐ḍu sĕlim̐gūḍeradiveḽa
yīvala moviguṟudu lĕṭlunnavi
devum̐ ḍidanigi mīm̐dĕttinayamṛtamugoni
vevelu mudralu payivesinayaṭlāya