ఇంతి సేసినభాగ్యవెూ యిట్టిది నీ కరుణో
(॥పల్లవి॥)
ఇంతి సేసినభాగ్యవెూ యిట్టిది నీ కరుణో
యెంతకెంత చెలులము యేమని పొగడెదము
(॥॥)
తలపోఁతలు రేఁచేవు తగ విడే లిప్పించేవు
నెలతకు నీకొలువు నిధానము
చలివాయ నవ్వేవు చదురఁ(రం)గా లాడేవు
చెలఁగి నీమన్ననలు చిగురులో చేఁగలో
(॥॥)
మొగ మెప్పుడఁ జూచేవు మోహములు చల్లేవు
మగువకు నీ పొందు లామనివంటలు
తగుల మాటలాడేవు తనివి బొందించేవు
వెగటులేనిమేలాలు వెన్నెలపులుఁగాలు
(॥॥)
చన్ను లేపొద్దూ ముట్టేవు సరసములాడేవు
కన్నెకు నీరతి తరగనిధాన్యము
యెన్నఁగ శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ
యిన్నిటా బోగములు యింటిలోనిసిరులు
(||pallavi||)
iṁti sesinabhāgyavĕూ yiṭṭidi nī karuṇo
yĕṁtagĕṁta sĕlulamu yemani pŏgaḍĕdamu
(||||)
talabom̐talu rem̐sevu taga viḍe lippiṁchevu
nĕladagu nīgŏluvu nidhānamu
salivāya navvevu saduram̐(raṁ)gā lāḍevu
sĕlam̐gi nīmannanalu sigurulo sem̐galo
(||||)
mŏga mĕppuḍam̐ jūsevu mohamulu sallevu
maguvagu nī pŏṁdu lāmanivaṁṭalu
tagula māḍalāḍevu tanivi bŏṁdiṁchevu
vĕgaḍulenimelālu vĕnnĕlabulum̐gālu
(||||)
sannu lebŏddū muṭṭevu sarasamulāḍevu
kannĕgu nīradi taraganidhānyamu
yĕnnam̐ga śhrī veṁkaḍeśha yīgĕ yalamelumaṁga
yinniḍā bogamulu yiṁṭilonisirulu