Imti seluvam bemcha nidarulagu vasamaunaa

ఇంతి చెలువం బెంచ నితరులకు వసమౌనా
Language

(॥పల్లవి॥)
ఇంతి చెలువం బెంచ నితరులకు వసమౌనా
ఇంతయునుఁ దలపోసి యెరిఁగించవలదా

(॥ఇంతి॥)
చిగురైనమోవిపై చిలుకవోట్లు నిండె
తగుఁ గోవిలకుఁగాక తనకేల
మొగమైనతామరకు మొగి విచారము లేదు
తగవులివి యేర్పరచి తా దిద్దవలదా

(॥ఇంతి॥)
పలుదజక్కవచన్నుల వంకలచంద్రులు వొడమె
జలధందుఁగాక ఇచ్చట నమరునా
కలికిమేనై నతీగకు విచారము లేదు
తలకొన్నయీతగవు తా దిద్దవలదా

(॥ఇంతి॥)
మఱి గజకరపుఁదొడల నఱిదిఁ బగడపులతలు
అఱంట్లందము గాక అందుకేలా
యెఱిఁగిశ్రీవేంకటేశు కీవిచారము లేదు
తఱిఁగూడీనీతగవు తా దిద్దవలదా

(||pallavi||)
iṁti sĕluvaṁ bĕṁcha nidarulagu vasamaunā
iṁtayunum̐ dalabosi yĕrim̐giṁchavaladā

(||iṁti||)
sigurainamovibai silugavoṭlu niṁḍĕ
tagum̐ govilagum̐gāga tanagela
mŏgamainadāmaragu mŏgi visāramu ledu
tagavulivi yerbarasi tā diddavaladā

(||iṁti||)
paludajakkavasannula vaṁkalasaṁdrulu vŏḍamĕ
jaladhaṁdum̐gāga ichchaḍa namarunā
kaligimenai nadīgagu visāramu ledu
talagŏnnayīdagavu tā diddavaladā

(||iṁti||)
maṟi gajagarabum̐dŏḍala naṟidim̐ bagaḍabuladalu
aṟaṁṭlaṁdamu gāga aṁdugelā
yĕṟim̐giśhrīveṁkaḍeśhu kīvisāramu ledu
taṟim̐gūḍīnīdagavu tā diddavaladā