Imti sanavu sellimchu meggulubattagu neevu

ఇంతి చనవు చెల్లించు మెగ్గులుపట్టకు నీవు
Language

(॥పల్లవి॥)
ఇంతి చనవు చెల్లించు మెగ్గులుపట్టకు నీవు
సంతిసించి మెచ్చుటే చాయపాటుఁదనము

(॥ఇంతి॥)
అంగన యలిగితేను అట్టె తా మారలుగక
సంగడిఁ గూచుండితేనే జాణతనము
యింగిత మెరిఁగి యాపె కిచ్చకములే యాడి
కొంగువట్టి తియ్యుటే గక్కున మంచితనము

(॥ఇంతి॥)
కామిని దిట్టిఁగాఁ జూచి కదిసి యాకెమ్మోవి
దోమటి దొడికితేను దొరతనము
చేముట్టి సరసమాడి చేతికి లోనుగాఁజేసి
ఆమనిరతిఁ జొక్కించే దది దొడ్డతనము

(॥ఇంతి॥)
గుట్టుతోడ నున్నసతి గొల్లునను నవ్వించి
నెట్టినఁ గాఁగిలించుటే నేర్పుఁదనము
యిట్టె శ్రీ వేంకటేశ యీమగువఁగూడితివి
నట్టనడుమఁ గూడుటే నయగారితనము

(||pallavi||)
iṁti sanavu sĕlliṁchu mĕggulubaṭṭagu nīvu
saṁtisiṁchi mĕchchuḍe sāyabāḍum̐danamu

(||iṁti||)
aṁgana yaligidenu aṭṭĕ tā māralugaga
saṁgaḍim̐ gūsuṁḍidene jāṇadanamu
yiṁgida mĕrim̐gi yābĕ kichchagamule yāḍi
kŏṁguvaṭṭi tiyyuḍe gakkuna maṁchidanamu

(||iṁti||)
kāmini diṭṭim̐gām̐ jūsi kadisi yāgĕmmovi
domaḍi dŏḍigidenu dŏradanamu
semuṭṭi sarasamāḍi sedigi lonugām̐jesi
āmaniradim̐ jŏkkiṁche dadi dŏḍḍadanamu

(||iṁti||)
guṭṭudoḍa nunnasadi gŏllunanu navviṁchi
nĕṭṭinam̐ gām̐giliṁchuḍe nerbum̐danamu
yiṭṭĕ śhrī veṁkaḍeśha yīmaguvam̐gūḍidivi
naṭṭanaḍumam̐ gūḍuḍe nayagāridanamu