Imti samdamulu neegu ninnee vinnavimchidimi

ఇంతి చందములు నీకు నిన్నీ విన్నవించితిమి
Language

(॥పల్లవి॥)
ఇంతి చందములు నీకు నిన్నీ విన్నవించితిమి
మంతు కెక్కఁ జేసి కూడి మన్నించవయ్యా

(॥ఇంతి॥)
మొలకనవ్వులనే ముగ్గులు వెట్టుకున్నది
వెలఁది యింటికి నీవు విచ్చేయవయ్యా
తళుకుఁ జెక్కులనే యద్దములు గట్టుకున్నది
సొలసి యీపెవంక చూడవయ్యా

(॥ఇంతి॥)
అట్టె మోవితేనెలవిం దాఇతము సేసినది
చుట్టమవై వచ్చి చవి చూడవయ్యా
గట్టి చన్నుల వలపు కప్పము గట్టుకున్నది
దట్టపు వేడుక నవధించవయ్యా

(॥ఇంతి॥)
వింతగాఁ గాఁగిలి నీకు విడిది గావించినది
సంతోసాన రతులెల్లా సలుపవయ్యా
ఇంతట శ్రీవేంకటేశ యిందు వచ్చి యేలితివి
చెంత నీపె సింగారాలు చిత్తగించవయ్యా

(||pallavi||)
iṁti saṁdamulu nīgu ninnī vinnaviṁchidimi
maṁtu kĕkkam̐ jesi kūḍi manniṁchavayyā

(||iṁti||)
mŏlaganavvulane muggulu vĕṭṭugunnadi
vĕlam̐di yiṁṭigi nīvu vichcheyavayyā
taḽugum̐ jĕkkulane yaddamulu gaṭṭugunnadi
sŏlasi yībĕvaṁka sūḍavayyā

(||iṁti||)
aṭṭĕ movidenĕlaviṁ dāidamu sesinadi
suṭṭamavai vachchi savi sūḍavayyā
gaṭṭi sannula valabu kappamu gaṭṭugunnadi
daṭṭabu veḍuga navadhiṁchavayyā

(||iṁti||)
viṁtagām̐ gām̐gili nīgu viḍidi gāviṁchinadi
saṁtosāna radulĕllā salubavayyā
iṁtaḍa śhrīveṁkaḍeśha yiṁdu vachchi yelidivi
sĕṁta nībĕ siṁgārālu sittagiṁchavayyā