Imti samdamulu needo nemtani vinnavimchemu

ఇంతి చందములు నీతో నెంతని విన్నవించేము
Language

(॥పల్లవి॥)
ఇంతి చందములు నీతో నెంతని విన్నవించేము
వింత విలాసము లివి వెల్లవిరులాయెను

(॥ఇంతి॥)
చింతల చీఁకటులను చిమ్మిరేఁగి వలపులు
చెంతనున్న చెక్కిటికి చేయి వచ్చెను
మంతనపుఁగోరికల మట్టుమీరి చూడఁగానే
వింతైన నిలువుఁగొప్పు వీఁపుమీఁద వాలెను

(॥ఇంతి॥)
విరహపు టడవుల వేసవి యెండలు గాసి
వెరగంది ముక్కుపైకి వేలు వచ్చేను
బెరసే తమకమున పెం జెమటవాన వుట్టి
సరుస చనుఁగొండలసంది నేరువారెను

(॥ఇంతి॥)
చిత్తజ కేలిని నీవు శ్రీవేంకటేశ కూడఁగా
కొత్తఁగా మేనికి కొనగోరు వచ్చేను
హత్తిన సంతోసాన ఆయములెల్లాఁగరఁగి
పొత్తుల మోవితెనె బువ్వాలు గలసెను

(||pallavi||)
iṁti saṁdamulu nīdo nĕṁtani vinnaviṁchemu
viṁta vilāsamu livi vĕllavirulāyĕnu

(||iṁti||)
siṁtala sīm̐kaḍulanu simmirem̐gi valabulu
sĕṁtanunna sĕkkiḍigi seyi vachchĕnu
maṁtanabum̐gorigala maṭṭumīri sūḍam̐gāne
viṁtaina niluvum̐gŏppu vīm̐pumīm̐da vālĕnu

(||iṁti||)
virahabu ṭaḍavula vesavi yĕṁḍalu gāsi
vĕragaṁdi mukkubaigi velu vachchenu
bĕrase tamagamuna pĕṁ jĕmaḍavāna vuṭṭi
sarusa sanum̐gŏṁḍalasaṁdi neruvārĕnu

(||iṁti||)
sittaja kelini nīvu śhrīveṁkaḍeśha kūḍam̐gā
kŏttam̐gā menigi kŏnagoru vachchenu
hattina saṁtosāna āyamulĕllām̐garam̐gi
pŏttula movidĕnĕ buvvālu galasĕnu