Imti pradaabamu neeve yeṟamgugonevugaaga

ఇంతి ప్రతాపము నీవే యెఱఁగుకొనేవుగాక
Language

(॥పల్లవి॥)
ఇంతి ప్రతాపము నీవే యెఱఁగుకొనేవుగాక
వింతలుగా వేరే నేము విన్నవించవలెనా

(॥ఇంతి॥)
నెలఁత చిఱునవ్వులే నిండాఁ దమి రేఁచేవి
కలికితనాలే మతి గరఁగించేవి
తలిరు మోవె వలపు తలకెక్కఁజేసేది
పలుమారు నేమిటికి పంతాలాడేవయ్యా

(॥ఇంతి॥)
వనిత చన్నుమొనలే వసము సేసుకొనేవి
కనుచూపులే వాఁడై కాఁడిపారేవి
ననిచిన కొనగోరే నాములై చొక్కించేది
యనలేని బింకాలు యెందువోయీనయ్యా

(॥ఇంతి॥)
మగువకాఁగిలె సారె మరుగఁగఁ జేసేది
నిగురుఁజేతులే నీ సేవ సేసేవి
తగరి శ్రీవేంకటేశ తతినీకెఁ గూడితివి
జిగిమించ నీ నేరుపు చెప్పనేఁటికయ్యా

(||pallavi||)
iṁti pradābamu nīve yĕṟam̐gugŏnevugāga
viṁtalugā vere nemu vinnaviṁchavalĕnā

(||iṁti||)
nĕlam̐ta siṟunavvule niṁḍām̐ dami rem̐sevi
kaligidanāle madi garam̐giṁchevi
taliru movĕ valabu talagĕkkam̐jesedi
palumāru nemiḍigi paṁtālāḍevayyā

(||iṁti||)
vanida sannumŏnale vasamu sesugŏnevi
kanusūbule vām̐ḍai kām̐ḍibārevi
nanisina kŏnagore nāmulai sŏkkiṁchedi
yanaleni biṁkālu yĕṁduvoyīnayyā

(||iṁti||)
maguvagām̐gilĕ sārĕ marugam̐gam̐ jesedi
nigurum̐jedule nī seva sesevi
tagari śhrīveṁkaḍeśha tadinīgĕm̐ gūḍidivi
jigimiṁcha nī nerubu sĕppanem̐ṭigayyā