Imti ninnu gadimide nemanevayya

ఇంతి నిన్ను గదిమితే నేమనేవయ్య
Language

(॥పల్లవి॥)
ఇంతి నిన్ను గదిమితే నేమనేవయ్య
వంతులెల్లా నెంచుకొంటా వద్దఁ గాచుకుండెను

(॥ఇంతి॥)
మిక్కుటముగా నప్పుడు మీరు మీరుఁ బెట్టుకొన్న-
యెక్కువ తక్కువ వొట్లేమాయను?
ఇక్కడికి విచ్చేసితి వింతలోనె తప్పించుక
వెక్కసమై యాపె నిన్ను వెతకుతానుండెను

(॥ఇంతి॥)
నగుతా నప్పుడు మీరు నంటుసేసి యాడుకొన్న-
యెగసక్కేపు బీరము లేమాయను
పగటున నామీఁదిపరాకున నున్నాఁడవు
తగిలి యీడకు వచ్చే దానంటా నుండెను

(॥ఇంతి॥)
కూడి మావాకిట మీరు కొప్పులు వట్టి తీసిన-
యీడుజోడు సరసము లేమాయను
యీడ నన్నుఁ గలసితి వింతలో శ్రీ వేంకటేశ
మోడా మోడితనమున మొక్కేనంటా నుండెను

(||pallavi||)
iṁti ninnu gadimide nemanevayya
vaṁtulĕllā nĕṁchugŏṁṭā vaddam̐ gāsuguṁḍĕnu

(||iṁti||)
mikkuḍamugā nappuḍu mīru mīrum̐ bĕṭṭugŏnna-
yĕkkuva takkuva vŏṭlemāyanu?
ikkaḍigi vichchesidi viṁtalonĕ tappiṁchuga
vĕkkasamai yābĕ ninnu vĕdagudānuṁḍĕnu

(||iṁti||)
nagudā nappuḍu mīru naṁṭusesi yāḍugŏnna-
yĕgasakkebu bīramu lemāyanu
pagaḍuna nāmīm̐dibarāguna nunnām̐ḍavu
tagili yīḍagu vachche dānaṁṭā nuṁḍĕnu

(||iṁti||)
kūḍi māvāgiḍa mīru kŏppulu vaṭṭi tīsina-
yīḍujoḍu sarasamu lemāyanu
yīḍa nannum̐ galasidi viṁtalo śhrī veṁkaḍeśha
moḍā moḍidanamuna mŏkkenaṁṭā nuṁḍĕnu