Imti ninnu dooramjaala dem(dem?)tainanu

ఇంతి నిన్ను దూరఁజాల దెఁ(దెం?)తైనను
Language

(॥పల్లవి॥)
ఇంతి నిన్ను దూరఁజాల దెఁ(దెం?)తైనను
వంతువట్టె నీకు నేఁడు వలసిన వూహలు

(॥ఇంతి॥)
సెలవుల నగఁగానే చెక్కలెల్లాఁ జెమరించె
వలవనిగాసిఁ బెట్టవద్దు ఆపెను
వలిపపయ్యదంటఁగా వాన గురిసెఁ గన్నీరు
తలఁచుకో నీచేసినతప్పులెల్లా నందును

(॥ఇంతి॥)
మాటలు నీవాడఁగానే మచ్చరపుఁజూపు లెచ్చె
వాఁటముగాఁ జండిపెట్టవద్దు ఆపెను
పాటించి వేఁడుకొనఁగా పలునిట్టూర్పు లు రేఁగె
యేఁటివో నీసరితలు యెఱుఁగుకో అందును

(॥ఇంతి॥)
ముంచి నీవు చూడఁగానే మోమునఁ గళలుదేరె
వంచనతోఁ గొనియాడవద్దు ఆపెను
అంచెల శ్రీవేంకటేశ అన్నిటాఁ దనిసే నాసె
నించి నీవే తెలుసుకో నీవుపకారములు

(||pallavi||)
iṁti ninnu dūram̐jāla dĕm̐(dĕṁ?)tainanu
vaṁtuvaṭṭĕ nīgu nem̐ḍu valasina vūhalu

(||iṁti||)
sĕlavula nagam̐gāne sĕkkalĕllām̐ jĕmariṁchĕ
valavanigāsim̐ bĕṭṭavaddu ābĕnu
valibabayyadaṁṭam̐gā vāna gurisĕm̐ gannīru
talam̐sugo nīsesinadappulĕllā naṁdunu

(||iṁti||)
māḍalu nīvāḍam̐gāne machcharabum̐jūbu lĕchchĕ
vām̐ṭamugām̐ jaṁḍibĕṭṭavaddu ābĕnu
pāḍiṁchi vem̐ḍugŏnam̐gā paluniṭṭūrbu lu rem̐gĕ
yem̐ṭivo nīsaridalu yĕṟum̐gugo aṁdunu

(||iṁti||)
muṁchi nīvu sūḍam̐gāne momunam̐ gaḽaluderĕ
vaṁchanadom̐ gŏniyāḍavaddu ābĕnu
aṁchĕla śhrīveṁkaḍeśha anniḍām̐ danise nāsĕ
niṁchi nīve tĕlusugo nīvubagāramulu