Imti nelugovayya yidi modalu

ఇంతి నేలుకోవయ్య యిది మొదలు
Language

(॥పల్లవి॥)
ఇంతి నేలుకోవయ్య యిది మొదలు
వంతు(త?)లకు బెట్టీనిదె వలపుల వెదలు

(॥ఇంతి॥)
మగువ నీకు గొనెమరులు
వెగటుగఁ గాముఁ డేసె విరులు
నిగిడి వీడెఁ గొప్పు నెరులు
తగ నీకుఁ గానుకిచ్చె తనుకుచగిరులు

(॥ఇంతి॥)
సుదతి నీ కెదురంపెఁ జూపులు
తుద నొక్క టొకటిపై తో దోపులు
మదితలపోత రేపుమాపులు
దియ కింత సేతురా కడుఁ దరితీపులు

(॥ఇంతి॥)
మోవి నిండెఁ జిరునవ్వు మొలకలు
పూవకపూచె మేనఁ బులలు
యీవేళ శ్రీవేంకటేశ యెనసితివి
సోవగా మాఁటలలోనఁ జుట్టకు మలకలు

(||pallavi||)
iṁti nelugovayya yidi mŏdalu
vaṁtu(ta?)lagu bĕṭṭīnidĕ valabula vĕdalu

(||iṁti||)
maguva nīgu gŏnĕmarulu
vĕgaḍugam̐ gāmum̐ ḍesĕ virulu
nigiḍi vīḍĕm̐ gŏppu nĕrulu
taga nīgum̐ gānugichchĕ tanugusagirulu

(||iṁti||)
sudadi nī kĕduraṁpĕm̐ jūbulu
tuda nŏkka ṭŏgaḍibai to dobulu
madidalaboda rebumābulu
diya kiṁta sedurā kaḍum̐ daridībulu

(||iṁti||)
movi niṁḍĕm̐ jirunavvu mŏlagalu
pūvagabūsĕ menam̐ bulalu
yīveḽa śhrīveṁkaḍeśha yĕnasidivi
sovagā mām̐ṭalalonam̐ juṭṭagu malagalu