Imti nelugomti vimka nedayaraadu

ఇంతి నేలుకొంటి వింక నెడయరాదు
Language

(॥పల్లవి॥)
ఇంతి నేలుకొంటి వింక నెడయరాదు
చెంత నా విన్నపమిట్టే చేకొనవయ్యా

(॥ఇంతి॥)
చెలిమి సేయఁగరాదు చెలి విడువఁగరాదు
తలఁచి బాస వీరాదు తప్పఁగ రాదు
మలసి మన్నించరాదు మన్నించి చెరుపరాదు
వలవరాదు వలచి వదలరాదు

(॥ఇంతి॥)
చన వియ్యరాదు యిచ్చి జాలిఁ బెట్టి యెంచరాదు
కొనల కెక్కించరాదు కుంగించరాదు
చెనకరాదు చెనకి సిగ్గులు వడఁగ రాదు
మన సియ్యరాదు యిచ్చి మఱవరాదు

(॥ఇంతి॥)
ఆస వెట్టరాదు పెట్టి యపలపించఁగరాదు
పోసరించఁ జేయరాదు పోరాడరాదు
నేసవెట్టి కూడితివి శ్రీవేంకటేశ కాంతను
వాసిఁ బొందుసేసి మటి వంచించరాదు

(||pallavi||)
iṁti nelugŏṁṭi viṁka nĕḍayarādu
sĕṁta nā vinnabamiṭṭe segŏnavayyā

(||iṁti||)
sĕlimi seyam̐garādu sĕli viḍuvam̐garādu
talam̐si bāsa vīrādu tappam̐ga rādu
malasi manniṁcharādu manniṁchi sĕrubarādu
valavarādu valasi vadalarādu

(||iṁti||)
sana viyyarādu yichchi jālim̐ bĕṭṭi yĕṁcharādu
kŏnala kĕkkiṁcharādu kuṁgiṁcharādu
sĕnagarādu sĕnagi siggulu vaḍam̐ga rādu
mana siyyarādu yichchi maṟavarādu

(||iṁti||)
āsa vĕṭṭarādu pĕṭṭi yabalabiṁcham̐garādu
posariṁcham̐ jeyarādu porāḍarādu
nesavĕṭṭi kūḍidivi śhrīveṁkaḍeśha kāṁtanu
vāsim̐ bŏṁdusesi maḍi vaṁchiṁcharādu