ఇంతి నేల వుప్పతించే వెంత కాతర మనుచు
(॥పల్లవి॥)
ఇంతి నేల వుప్పతించే వెంత కాతర మనుచు
చెంత నీపె మోహము నీ సంతోసమే కాదా
(॥॥)
మొక్కలానఁ జింతతోడ మూసిన రెప్పల చూపు
గక్కన నిన్నుఁ గంటే కాఁడి పారదా
అక్కరతో విన్నాళ్ళూ నాపుకొనున్నవలపు
వెక్కసమై నీమీఁద వెల్లిగొనదా
(॥॥)
వొగ్గి నీకుఁ గా లోలో నుమ్మగిలిన మాటలు
దగ్గర నీవు వచ్చితే తగులుకోవా
సిగ్గులతో నల్లంతఁ జిముడుచున్న మనసు
బెగ్గిల నిన్నుఁ గౌఁగిట బిగియించఁ జెల్లదా
(॥॥)
వుప్పతిల్లి మేని మీఁద నుడివోని తమకము
చొప్పగు నీ రతులలో సుడిగొనదా
యిప్పుడే శ్రీ వేంకటేశ యీకె నేలితివి గాక
తొప్పఁ దోగిన చెమట దొమ్మి నోలలార్చదా
(||pallavi||)
iṁti nela vuppadiṁche vĕṁta kādara manusu
sĕṁta nībĕ mohamu nī saṁtosame kādā
(||||)
mŏkkalānam̐ jiṁtadoḍa mūsina rĕppala sūbu
gakkana ninnum̐ gaṁṭe kām̐ḍi pāradā
akkarado vinnāḽḽū nābugŏnunnavalabu
vĕkkasamai nīmīm̐da vĕlligŏnadā
(||||)
vŏggi nīgum̐ gā lolo nummagilina māḍalu
daggara nīvu vachchide tagulugovā
siggulado nallaṁtam̐ jimuḍusunna manasu
bĕggila ninnum̐ gaum̐giḍa bigiyiṁcham̐ jĕlladā
(||||)
vuppadilli meni mīm̐da nuḍivoni tamagamu
sŏppagu nī radulalo suḍigŏnadā
yippuḍe śhrī veṁkaḍeśha yīgĕ nelidivi gāga
tŏppam̐ dogina sĕmaḍa dŏmmi nolalārsadā