Imti neegu nojjalaaya niduvamti semtalagu

ఇంతి నీకు నొజ్జలాయ నిటువంటి చేఁతలకు
Language

(॥పల్లవి॥)
ఇంతి నీకు నొజ్జలాయ నిటువంటి చేఁతలకు
యింతేసి తొల్లి యెరఁగ విప్పుడే నేర్చితివి

(॥ఇంతి॥)
యేమని మాటాడెనో యేక తాన నాపె నీతో
నామోము చూచి నీవు నవ్వు నవ్వేవు
చేముంచి నీ కెట్లాను సిగ్గులు దేరిచెనో
ప్రేమముతో మోవి మోవిఁ బెనచ వచ్చేవు

(॥ఇంతి॥)
సారె నాపె నీకు నెట్టి చవులు మరిపెనో
చేరి నాపొత్తులకే చెయి చాఁచేవు
తోరముగా నేగతి నిందుకు సాము సేయించునో
బీరముతోఁ గాఁగిటఁ బెనఁగఁ జూచేవు

(॥ఇంతి॥)
సన్న లేరతి జేసెనో సముకమున నీ కాపె
కిన్నెరవంటి గుబ్బలు గిలిగించేవు
యన్నిటా శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
సన్ననిచెక్కులు గోర నొక్కఁదలఁచేవు

(||pallavi||)
iṁti nīgu nŏjjalāya niḍuvaṁṭi sem̐talagu
yiṁtesi tŏlli yĕram̐ga vippuḍe nersidivi

(||iṁti||)
yemani māḍāḍĕno yega tāna nābĕ nīdo
nāmomu sūsi nīvu navvu navvevu
semuṁchi nī kĕṭlānu siggulu derisĕno
premamudo movi movim̐ bĕnasa vachchevu

(||iṁti||)
sārĕ nābĕ nīgu nĕṭṭi savulu maribĕno
seri nābŏttulage sĕyi sām̐sevu
toramugā negadi niṁdugu sāmu seyiṁchuno
bīramudom̐ gām̐giḍam̐ bĕnam̐gam̐ jūsevu

(||iṁti||)
sanna leradi jesĕno samugamuna nī kābĕ
kinnĕravaṁṭi gubbalu giligiṁchevu
yanniḍā śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
sannanisĕkkulu gora nŏkkam̐dalam̐sevu