ఇంతి నీకు మీఁదెత్తీ ఇట్టే వలపు
(॥పల్లవి॥)
ఇంతి నీకు మీఁదెత్తీ ఇట్టే వలపు
కాంతుఁడ చేకొనవయ్య కడలేని వలపు
(॥ఇంతి॥)
చిగురుఁగత్తిపై దార చిమ్మిరేఁగేవలపు
బిగువునామనివేళ పెడరేఁచేవలపు
మొగిలు కన్నులఁ గంటే మోనచూపేవలపు
నిగిడి పూవుటమ్ముల నిండువాఁడివలపు
(॥ఇంతి॥)
చూపులంటితేనే వొళ్లు జుమ్మురనేవలపు
యేపుమాటలనే నాములెక్కీటివలపు
పైపై సెలవినవ్వుల భ్రమయించేవలపు
కాపైనవెన్నెలలోనికడువేఁడివలపు
(॥ఇంతి॥)
పానుపుపైఁ గూడితేనే పచ్చి చూపేవలపు
పూనిన మోవితేనెకు పొత్తుసేసేవలపు
కానుకై శ్రీవేంకటేశ కాంత నిట్టె యేలితివి
నానీ నీమన్ననలను ననుపైనవలపు
(||pallavi||)
iṁti nīgu mīm̐dĕttī iṭṭe valabu
kāṁtum̐ḍa segŏnavayya kaḍaleni valabu
(||iṁti||)
sigurum̐gattibai dāra simmirem̐gevalabu
biguvunāmaniveḽa pĕḍarem̐sevalabu
mŏgilu kannulam̐ gaṁṭe monasūbevalabu
nigiḍi pūvuḍammula niṁḍuvām̐ḍivalabu
(||iṁti||)
sūbulaṁṭidene vŏḽlu jummuranevalabu
yebumāḍalane nāmulĕkkīḍivalabu
paibai sĕlavinavvula bhramayiṁchevalabu
kābainavĕnnĕlalonigaḍuvem̐ḍivalabu
(||iṁti||)
pānububaim̐ gūḍidene pachchi sūbevalabu
pūnina movidenĕgu pŏttusesevalabu
kānugai śhrīveṁkaḍeśha kāṁta niṭṭĕ yelidivi
nānī nīmannanalanu nanubainavalabu