ఇంతి నీతో నవ్వఁగాను యెదురుగా ననుపులు
(॥పల్లవి॥)
ఇంతి నీతో నవ్వఁగాను యెదురుగా ననుపులు
దొంతివెట్టి వలపులు దోమటి దొడికేవు
(॥॥)
వావి నిన్నునడిగేటివనితఁ జూచి నీవు
మోవితేనె లడిగేవు మొక్కలీఁడవై
కావికన్నులఁ జూచి కడుఁజొక్కఁగాఁ బిల్లఁ-
గోవిరాగాల నప్పటిఁ గొచ్చి కరఁగించేవు
(॥॥)
పేరు చెప్పమని నీతోఁ బెనఁగఁగా నాపెచెక్కు
గోరు దాఁకించేవు నీవు కోడెకాఁడవై
వూరుఁజెమటలతోడ వొగి మొక్కఁగా ముత్తేలఁ
పేరులెల్లా మెడవేసి ప్రేమము రేఁచేవు
(॥॥)
ఆటలాడ రమ్మనుచు నలమేల్మంగ దూరఁగా
పాటలు పాడుమనేవు పల్లదీఁడవై
గాఁటపు శ్రీ వేంకటేశ కలయఁగా సమరతిఁ
తేటలనే మెప్పించి తీపు వుట్టించేవు
(||pallavi||)
iṁti nīdo navvam̐gānu yĕdurugā nanubulu
dŏṁtivĕṭṭi valabulu domaḍi dŏḍigevu
(||||)
vāvi ninnunaḍigeḍivanidam̐ jūsi nīvu
movidenĕ laḍigevu mŏkkalīm̐ḍavai
kāvigannulam̐ jūsi kaḍum̐jŏkkam̐gām̐ billam̐-
govirāgāla nappaḍim̐ gŏchchi karam̐giṁchevu
(||||)
peru sĕppamani nīdom̐ bĕnam̐gam̐gā nābĕsĕkku
goru dām̐kiṁchevu nīvu koḍĕgām̐ḍavai
vūrum̐jĕmaḍaladoḍa vŏgi mŏkkam̐gā muttelam̐
perulĕllā mĕḍavesi premamu rem̐sevu
(||||)
āḍalāḍa rammanusu nalamelmaṁga dūram̐gā
pāḍalu pāḍumanevu palladīm̐ḍavai
gām̐ṭabu śhrī veṁkaḍeśha kalayam̐gā samaradim̐
teḍalane mĕppiṁchi tību vuṭṭiṁchevu