Imti neebaim jeyu tidigadaa valabu nee

ఇంతి నీపైఁ జేయు టిదిగదా వలపు నీ
Language

(॥పల్లవి॥)
ఇంతి నీపైఁ జేయు టిదిగదా వలపు నీ-
వంతటికి సమ్మతించు టదిగదా వలపు

(॥ఇంతి॥)
పెదవిపైఁ దములంపుబేంట్లటురాలఁగా
యెదుట నేకతమాడు టిదిగదా వలపు
వదలుఁదురుమునశిరసు వడి నీదుతొడలపై-
నదన నిడుకొని నవ్వు టదిగదా వలపు

(॥ఇంతి॥)
కనుఁగొనలమోడ్పుతో కాఁకదేరఁగఁ జూచి
యెనలేక మైమరచు టిదిగదా వలపు
కొనచెమట జవ్వాదిఁ గూడి చెక్కుల జార
అనుగుఁజేయి పయివేయు టదిగదా వలపు

(॥ఇంతి॥)
వొడలునొడలునుఁ బెనచి వొక్కటై చెమరించి
యెడపుఁబయ్యెద దడుపు టదిగదా వలపు
జడిసి శ్రీవేంకటేశ్వర నీవు నీచెలియ
అడియాలముగఁ గలము టదిగదా వలపు

(||pallavi||)
iṁti nībaim̐ jeyu ṭidigadā valabu nī-
vaṁtaḍigi sammadiṁchu ṭadigadā valabu

(||iṁti||)
pĕdavibaim̐ damulaṁpubeṁṭlaḍurālam̐gā
yĕduḍa negadamāḍu ṭidigadā valabu
vadalum̐durumunaśhirasu vaḍi nīdudŏḍalabai-
nadana niḍugŏni navvu ṭadigadā valabu

(||iṁti||)
kanum̐gŏnalamoḍpudo kām̐kaderam̐gam̐ jūsi
yĕnalega maimarasu ṭidigadā valabu
kŏnasĕmaḍa javvādim̐ gūḍi sĕkkula jāra
anugum̐jeyi payiveyu ṭadigadā valabu

(||iṁti||)
vŏḍalunŏḍalunum̐ bĕnasi vŏkkaḍai sĕmariṁchi
yĕḍabum̐bayyĕda daḍubu ṭadigadā valabu
jaḍisi śhrīveṁkaḍeśhvara nīvu nīsĕliya
aḍiyālamugam̐ galamu ṭadigadā valabu