ఇంతి నీపై మోహ మెటువంటిదో కాని
(॥పల్లవి॥)
ఇంతి నీపై మోహ మెటువంటిదో కాని
కాంతుఁడవు నీ మనసు గరఁగించె నిపుడు
(॥ఇంతి॥)
సుదతి ని న్నల్లార్చి చూచె నొకచూపు
అదనఁ దేలించి చూచె నది యొకచూపు
వుదుటు నాటఁగఁ జూచె నొరసి వొకచూపు
వెదచల్లి చూచె నొకతి వేగిరపుచూపు
(॥ఇంతి॥)
సొగసి నిను జంకించి చూచె నొకచూపు
అగలించి చూచె నొక అందపుఁ జూపు
తగిలి వెంటనే గోర్చి తగఁ జూచె నొక చూపు
జిగిదీర సొలసి చూచెను వొక్కచూపు
(॥ఇంతి॥)
సొరిదిఁ దోరణముగాఁ జూచె నొకచూపు
అరమోడ్చి చూచెనొక అనువగుఁ జూపు
సొరిది నూరక కులికి చూచె నొకచూపు
సిరులపైఁ బార నటు చిమ్మె నొకచూపు
(॥ఇంతి॥)
చొనిపి నినుఁ జట్టుగాఁ జూచె నొక చూపు
చెనకి మగిడించి చూచె నొకచూపు
జునిగి సిగ్గున వంచి చూచె నొకచూపు
పెనఁగుచునే మిగుల జళిపించె నొకచూపు
(॥ఇంతి॥)
చొక్కముగ మగిడించి చూచె నొకచూపు
లెక్కించి మై నివాళించె నొకచూపు
ఇక్కువల శ్రీవేంకటేశుకౌఁగిటఁ గూడి
కక్కసపుఁ తమకములఁ గదిసె నొకచూపు
(||pallavi||)
iṁti nībai moha mĕḍuvaṁṭido kāni
kāṁtum̐ḍavu nī manasu garam̐giṁchĕ nibuḍu
(||iṁti||)
sudadi ni nnallārsi sūsĕ nŏgasūbu
adanam̐ deliṁchi sūsĕ nadi yŏgasūbu
vuduḍu nāḍam̐gam̐ jūsĕ nŏrasi vŏgasūbu
vĕdasalli sūsĕ nŏgadi vegirabusūbu
(||iṁti||)
sŏgasi ninu jaṁkiṁchi sūsĕ nŏgasūbu
agaliṁchi sūsĕ nŏga aṁdabum̐ jūbu
tagili vĕṁṭane gorsi tagam̐ jūsĕ nŏga sūbu
jigidīra sŏlasi sūsĕnu vŏkkasūbu
(||iṁti||)
sŏridim̐ doraṇamugām̐ jūsĕ nŏgasūbu
aramoḍchi sūsĕnŏga anuvagum̐ jūbu
sŏridi nūraga kuligi sūsĕ nŏgasūbu
sirulabaim̐ bāra naḍu simmĕ nŏgasūbu
(||iṁti||)
sŏnibi ninum̐ jaṭṭugām̐ jūsĕ nŏga sūbu
sĕnagi magiḍiṁchi sūsĕ nŏgasūbu
junigi sigguna vaṁchi sūsĕ nŏgasūbu
pĕnam̐gusune migula jaḽibiṁchĕ nŏgasūbu
(||iṁti||)
sŏkkamuga magiḍiṁchi sūsĕ nŏgasūbu
lĕkkiṁchi mai nivāḽiṁchĕ nŏgasūbu
ikkuvala śhrīveṁkaḍeśhugaum̐giḍam̐ gūḍi
kakkasabum̐ tamagamulam̐ gadisĕ nŏgasūbu