Imti nee simgaaramu lemtani pogadavachchu

ఇంతి నీ సింగారము లెంతని పొగడవచ్చు
Language

(॥పల్లవి॥)
ఇంతి నీ సింగారము లెంతని పొగడవచ్చు
కంతుని సంపదవై కలిగితి విపుడు

(॥ఇంతి॥)
భామ నీసెలవులను పండువెన్నెలలు గాసీ
నీమోమే చంద్రుఁడౌత నిక్కమేకదే
కొమలపుఁదుమ్మిదలె కొప్పువలెఁ గనుపట్టె
తామరలు కన్నుల గాఁదగునే నీకును

(॥ఇంతి॥)
రమణి నీమాటలను రసములు దొలఁకీని
అమరునే నీమోవి పండనేఁటిమాట
జమళిబాహులతలు సమకొనె నీమేన
కొమరెగుబ్బలు పువ్వుగుత్తులౌ టేమరుదే

(॥ఇంతి॥)
మెలుఁత నీనిలువెల్లా మించి వన్నెల కెక్కెను
అలరి బంగారుబొమ్మవౌదువే నీవు
చెలఁగి నీకాఁగిటను శ్రీవేంకటేశుఁడు గూడె
నెలకొన్ననీ నడలు నెమళ్లూ నవునే

(||pallavi||)
iṁti nī siṁgāramu lĕṁtani pŏgaḍavachchu
kaṁtuni saṁpadavai kaligidi vibuḍu

(||iṁti||)
bhāma nīsĕlavulanu paṁḍuvĕnnĕlalu gāsī
nīmome saṁdrum̐ḍauda nikkamegade
kŏmalabum̐dummidalĕ kŏppuvalĕm̐ ganubaṭṭĕ
tāmaralu kannula gām̐dagune nīgunu

(||iṁti||)
ramaṇi nīmāḍalanu rasamulu dŏlam̐kīni
amarune nīmovi paṁḍanem̐ṭimāḍa
jamaḽibāhuladalu samagŏnĕ nīmena
kŏmarĕgubbalu puvvuguttulau ṭemarude

(||iṁti||)
mĕlum̐ta nīniluvĕllā miṁchi vannĕla kĕkkĕnu
alari baṁgārubŏmmavauduve nīvu
sĕlam̐gi nīgām̐giḍanu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
nĕlagŏnnanī naḍalu nĕmaḽlū navune