Imti nee javvanavana mee maadhavumdu

ఇంతి నీ జవ్వనవన మీ మాధవుఁడు
Language

(॥పల్లవి॥)
ఇంతి నీ జవ్వనవన మీ మాధవుఁడు
పంతమునఁ జొచ్చి యిట్టే పాయక వున్నాఁడు

(॥॥)
బెట్టి యెలుఁగునఁ బతిఁ బిలువఁగాఁ గోవిలలు
చుట్టి కూయఁ దొడఁగెను చుట్టాలంటా
వొట్టికతలు చెప్పఁగా నొద్దికై చిల్లుకలెల్లా
మట్టి తమవారంటా మాటలాడఁ దొడఁగె

(॥॥)
పడఁతి నీకుచములు పాలార్చి చక్కఁబెట్టిఁగా
తడఁబడీ జక్కవలు తమజాతంటా
నడపులు చూచి యట్టే నానా హంసములు
బడిఁ దిరిగీఁ దమ పాలివారలనుచు

(॥॥)
చెలి నీనెరిఁగురులు చిక్కుదియ్యఁగా గని
అళులు తమ మూఁకని అండ చేరీని
యెలమి శ్రీవేంకటేశుఁడీతఁడే నిన్నుఁ గూడితే
కులికి చూడఁగాను చకోరాలు వాలీని

(||pallavi||)
iṁti nī javvanavana mī mādhavum̐ḍu
paṁtamunam̐ jŏchchi yiṭṭe pāyaga vunnām̐ḍu

(||||)
bĕṭṭi yĕlum̐gunam̐ badim̐ biluvam̐gām̐ govilalu
suṭṭi kūyam̐ dŏḍam̐gĕnu suṭṭālaṁṭā
vŏṭṭigadalu sĕppam̐gā nŏddigai sillugalĕllā
maṭṭi tamavāraṁṭā māḍalāḍam̐ dŏḍam̐gĕ

(||||)
paḍam̐ti nīgusamulu pālārsi sakkam̐bĕṭṭim̐gā
taḍam̐baḍī jakkavalu tamajādaṁṭā
naḍabulu sūsi yaṭṭe nānā haṁsamulu
baḍim̐ dirigīm̐ dama pālivāralanusu

(||||)
sĕli nīnĕrim̐gurulu sikkudiyyam̐gā gani
aḽulu tama mūm̐kani aṁḍa serīni
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍīdam̐ḍe ninnum̐ gūḍide
kuligi sūḍam̐gānu sagorālu vālīni