Imti nee devulu neevu yemtasesinaam jellu

ఇంతి నీ దేవులు నీవు యెంతసేసినాఁ జెల్లు
Language

(॥పల్లవి॥)
ఇంతి నీ దేవులు నీవు యెంతసేసినాఁ జెల్లు
మంతు కెక్కితివి నీకు మరియేల వెఱపు

(॥ఇంతి॥)
వలవనిజాగు సేయవద్దుగాక మాతోను
తెలిపి చెప్పితేనేపో దేవరపు
చెలి నేఁపి ఇంత రట్టుసేయవద్దుగాక నీవు
నెలకొ నేమిసేసినా నీకేమి వెఱవు

(॥ఇంతి॥)
వట్టినవ్వులెల్లా నవ్వవద్దుగాకఆపె నిట్టె
తిట్టితే నీవేపో దవరవు
చుట్టపువరుసనే సూడువెనఁగఁగవద్దు
పట్టి నీపిడికిటిలో బెట్టు యేల వెఱపు

(॥ఇంతి॥)
నాలిమాఁటలాడి కల్లనమ్మికలు వద్దుగాక
తేలించకున్న నీవే దేవరపు
యీలీల శ్రీవేంకటేశ యెనసితి వీలేమను
తాలిమితో మేలాయఁ దగ దిఁక వలపు

(||pallavi||)
iṁti nī devulu nīvu yĕṁtasesinām̐ jĕllu
maṁtu kĕkkidivi nīgu mariyela vĕṟabu

(||iṁti||)
valavanijāgu seyavaddugāga mādonu
tĕlibi sĕppidenebo devarabu
sĕli nem̐pi iṁta raṭṭuseyavaddugāga nīvu
nĕlagŏ nemisesinā nīgemi vĕṟavu

(||iṁti||)
vaṭṭinavvulĕllā navvavaddugāgaābĕ niṭṭĕ
tiṭṭide nīvebo davaravu
suṭṭabuvarusane sūḍuvĕnam̐gam̐gavaddu
paṭṭi nībiḍigiḍilo bĕṭṭu yela vĕṟabu

(||iṁti||)
nālimām̐ṭalāḍi kallanammigalu vaddugāga
teliṁchagunna nīve devarabu
yīlīla śhrīveṁkaḍeśha yĕnasidi vīlemanu
tālimido melāyam̐ daga dim̐ka valabu