ఇంతి లాగులెల్లా నీకు నెరిఁగించితిమి నేము
(॥పల్లవి॥)
ఇంతి లాగులెల్లా నీకు నెరిఁగించితిమి నేము
మంతు కెక్కించి యీపెను మన్నించవయ్యా
(॥ఇంతి॥)
యెదురులు చూచీ నీకు;యింతులనుఁగొంతదూరు
వుదుటు గుబ్బలపై నిట్టూర్పు చల్లును
చెదరుఁగురులు దువ్వు చెక్కుపైఁ జేయి చేర్చు
యిదివో నీ సతి సుద్దు లింకా నడుగవయ్యా
(॥ఇంతి॥)
నిలువెల్లాఁ జెమరించు నీపై పాటలు వాడు
తలఁచు నీ రూపము తమకించును
సొలసు నూరక నిన్ను చొక్కుఁదనలోనె తాను
వెలఁది వలపు రీతి విన్నవించితిమయ్యా
(॥ఇంతి॥)
నివ్వెరగుతో నుండు నీకు లేకలు వాసు
పవ్వళించి నీ రతులు భావించును
ఇవ్వల శ్రీవేంకటేశ ఇంతి నిట్టె యేలితివి
రవ్వలాయ నీకుఁగానే రమణిఁ జూడవయ్యా
(||pallavi||)
iṁti lāgulĕllā nīgu nĕrim̐giṁchidimi nemu
maṁtu kĕkkiṁchi yībĕnu manniṁchavayyā
(||iṁti||)
yĕdurulu sūsī nīgu;yiṁtulanum̐gŏṁtadūru
vuduḍu gubbalabai niṭṭūrbu sallunu
sĕdarum̐gurulu duvvu sĕkkubaim̐ jeyi sersu
yidivo nī sadi suddu liṁkā naḍugavayyā
(||iṁti||)
niluvĕllām̐ jĕmariṁchu nībai pāḍalu vāḍu
talam̐su nī rūbamu tamagiṁchunu
sŏlasu nūraga ninnu sŏkkum̐danalonĕ tānu
vĕlam̐di valabu rīdi vinnaviṁchidimayyā
(||iṁti||)
nivvĕragudo nuṁḍu nīgu legalu vāsu
pavvaḽiṁchi nī radulu bhāviṁchunu
ivvala śhrīveṁkaḍeśha iṁti niṭṭĕ yelidivi
ravvalāya nīgum̐gāne ramaṇim̐ jūḍavayyā