ఇంతి జవ్వనరాజ్య మేలుదువు రావయ్య
(॥పల్లవి॥)
ఇంతి జవ్వనరాజ్య మేలుదువు రావయ్య
పంతముతో నీకు సోబనకాల మబ్బెను
(॥ఇంతి॥)
చెలపలచెమటల చెలమ వూటులెత్త
కొలఁదిమీరినచనుఁగొండసంది
అలకలతీగెలు సర్వాంగముల నల్లుకొనె
వలపులసోనలచే వనితమెయి నానెను
(॥ఇంతి॥)
దొరకొని నిట్టూరుపుతూరుపుగాలి విసరె
తరుణిలావణ్యసముద్రముమీఁదను
గరిమఁ జెక్కల పులకలపైరు జాజుకొనె
విరహపుచిహ్నలచే వెలఁది రవ్వాయను
(॥ఇంతి॥)
వినయపుమాఁటల కోవిల వెలిగించఁ జొచ్చె
కొనబైన కుత్తిక గూఁటిలో నుండి
యెనసితిని శ్రీవేంకటేశ యింతలో నీకెను
మనసిజబలాలచే మగువ సొంపెక్కెను
(||pallavi||)
iṁti javvanarājya meluduvu rāvayya
paṁtamudo nīgu sobanagāla mabbĕnu
(||iṁti||)
sĕlabalasĕmaḍala sĕlama vūḍulĕtta
kŏlam̐dimīrinasanum̐gŏṁḍasaṁdi
alagaladīgĕlu sarvāṁgamula nallugŏnĕ
valabulasonalase vanidamĕyi nānĕnu
(||iṁti||)
dŏragŏni niṭṭūrubudūrubugāli visarĕ
taruṇilāvaṇyasamudramumīm̐danu
garimam̐ jĕkkala pulagalabairu jājugŏnĕ
virahabusihnalase vĕlam̐di ravvāyanu
(||iṁti||)
vinayabumām̐ṭala kovila vĕligiṁcham̐ jŏchchĕ
kŏnabaina kuttiga gūm̐ṭilo nuṁḍi
yĕnasidini śhrīveṁkaḍeśha yiṁtalo nīgĕnu
manasijabalālase maguva sŏṁpĕkkĕnu