ఇంతి గుణసాధ్యురాలు యిటువలెఁ జేతురా
(॥పల్లవి॥)
ఇంతి గుణసాధ్యురాలు యిటువలెఁ జేతురా
వంతులకు వచ్చినట్టె వచ్చుటగాక
(॥ఇంతి॥)
పెద్దరికానఁ జెలియ పీఁటమీఁదఁ గూచుండఁగా
గద్దరితనాన నీవు కాఁతాళించేవు
కొద్దిమీరఁ జిన్నఁబుచ్చుకొని మోము వంచె ని
వుద్దండపుజం కెనల కోరుచునా యాకె
(॥ఇంతి॥)
సిగ్గరితనానఁ జెక్కు చేతఁ బెట్టుకుండఁగా
బగ్గడితనాన నీవు పదరుదురా
వెగ్గళించలేక తానే వెలవెలఁ బుచ్చుకొనె
కగ్గునీబింకములకుఁ గలదా యీకె
(॥ఇంతి॥)
గోలయై పానుపుమీఁద గుట్టున నట్టె వుండఁగా
పేలరివై కాఁగిట బిగియించేవు
లాలించి శ్రీవేంకటేశ లలన నిన్నుఁ గలసె
నీలావరితనానకు నేరుచునా యీకె
(||pallavi||)
iṁti guṇasādhyurālu yiḍuvalĕm̐ jedurā
vaṁtulagu vachchinaṭṭĕ vachchuḍagāga
(||iṁti||)
pĕddarigānam̐ jĕliya pīm̐ṭamīm̐dam̐ gūsuṁḍam̐gā
gaddaridanāna nīvu kām̐tāḽiṁchevu
kŏddimīram̐ jinnam̐buchchugŏni momu vaṁchĕ ni
vuddaṁḍabujaṁ kĕnala korusunā yāgĕ
(||iṁti||)
siggaridanānam̐ jĕkku sedam̐ bĕṭṭuguṁḍam̐gā
baggaḍidanāna nīvu padarudurā
vĕggaḽiṁchalega tāne vĕlavĕlam̐ buchchugŏnĕ
kaggunībiṁkamulagum̐ galadā yīgĕ
(||iṁti||)
golayai pānubumīm̐da guṭṭuna naṭṭĕ vuṁḍam̐gā
pelarivai kām̐giḍa bigiyiṁchevu
lāliṁchi śhrīveṁkaḍeśha lalana ninnum̐ galasĕ
nīlāvaridanānagu nerusunā yīgĕ