ఇంతి గుణ మెఱఁగవా యేమైనా నీవు
(॥పల్లవి॥)
ఇంతి గుణ మెఱఁగవా యేమైనా నీవు
వింత సేయక లోనికి విచ్చేయవయ్యా
(॥ఇంతి॥)
సేసిననీచేఁతలకు చెలి యేమి నలుగదు
రాసికెక్కె నీ వేడుక రాఁగదవయ్యా
ఆసుద్ది దడవనని యానవట్టె నీమిఁద
చేసూటితో నీపె నీచిత్తములోనిదయా
(॥ఇంతి॥)
యెటువలె నీవుండినా నెదురుమాఁటాడదు
సటగాదు రావయ్యా సమ్మతించెను
తటుకన లేచివచ్చి తానే మొక్కీ నీకు నదె
యిటుచూడు మిపె నీకు నిచ్చకురాలయ్యా
(॥ఇంతి॥)
యెచ్చటనుండి వచ్చినా నెరవు సేయదు నిన్ను
చొచ్చి రావయ్యా యీడేరె చుట్టరికము
ఇచ్చటఁ గాఁగిలించె నిన్నిట్టె శ్రీవేంకటేశ్వర
పచ్చిదేరె నీకె నీపట్టపు దేవులయా
(||pallavi||)
iṁti guṇa mĕṟam̐gavā yemainā nīvu
viṁta seyaga lonigi vichcheyavayyā
(||iṁti||)
sesinanīsem̐talagu sĕli yemi nalugadu
rāsigĕkkĕ nī veḍuga rām̐gadavayyā
āsuddi daḍavanani yānavaṭṭĕ nīmim̐da
sesūḍido nībĕ nīsittamulonidayā
(||iṁti||)
yĕḍuvalĕ nīvuṁḍinā nĕdurumām̐ṭāḍadu
saḍagādu rāvayyā sammadiṁchĕnu
taḍugana lesivachchi tāne mŏkkī nīgu nadĕ
yiḍusūḍu mibĕ nīgu nichchagurālayyā
(||iṁti||)
yĕchchaḍanuṁḍi vachchinā nĕravu seyadu ninnu
sŏchchi rāvayyā yīḍerĕ suṭṭarigamu
ichchaḍam̐ gām̐giliṁchĕ ninniṭṭĕ śhrīveṁkaḍeśhvara
pachchiderĕ nīgĕ nībaṭṭabu devulayā