ఇంతి గడు జవరాలు ఇంతట మన్నించరాదా
(॥పల్లవి॥)
ఇంతి గడు జవరాలు ఇంతట మన్నించరాదా
చెంతనుండి చూచిచూచి చిప్పిలీ మా మనసు
(॥ఇంతి॥)
జల జలఁ జెమరించె జాజులు కొప్పున జారె
చెలితో నేమి సాములు సే సేవయ్య
తవిరుమోవి వాడి తమకము గదురేఁగె
మలసి యెందాఁకాను మాటలాడించేవయ్య
(॥ఇంతి॥)
చెదరెను ముంగురులు చిట్లె గందపుబొట్టు
సుదతి నవ్వుల నెంత చొక్కించేవయ్య
వుదుటుగుబ్బలు రాసె నొయ్యనే పయ్యద జారె
ఇదె నీపాదా లొత్తించే వెందాఁకానయ్య
(॥ఇంతి॥)
కన్నులఁ గెంపులు దేరె కళలు మోమున నిండె
కన్నె నెంత రతులను గదిమే వయ్య
ఇన్నిటా శ్రీ వేంకటేశ యేలితివి వేడుకతో
యెన్నేసి తరితీపుల నింపు పుట్టించేవయ్యా
(||pallavi||)
iṁti gaḍu javarālu iṁtaḍa manniṁcharādā
sĕṁtanuṁḍi sūsisūsi sippilī mā manasu
(||iṁti||)
jala jalam̐ jĕmariṁchĕ jājulu kŏppuna jārĕ
sĕlido nemi sāmulu se sevayya
tavirumovi vāḍi tamagamu gadurem̐gĕ
malasi yĕṁdām̐kānu māḍalāḍiṁchevayya
(||iṁti||)
sĕdarĕnu muṁgurulu siṭlĕ gaṁdabubŏṭṭu
sudadi navvula nĕṁta sŏkkiṁchevayya
vuduḍugubbalu rāsĕ nŏyyane payyada jārĕ
idĕ nībādā lŏttiṁche vĕṁdām̐kānayya
(||iṁti||)
kannulam̐ gĕṁpulu derĕ kaḽalu momuna niṁḍĕ
kannĕ nĕṁta radulanu gadime vayya
inniḍā śhrī veṁkaḍeśha yelidivi veḍugado
yĕnnesi taridībula niṁpu puṭṭiṁchevayyā