Imti dikku soodaraadaa yekkadaa paraagu neegu

ఇంతి దిక్కు చూడరాదా యెక్కడా పరాకు నీకు
Language

(॥పల్లవి॥)
ఇంతి దిక్కు చూడరాదా యెక్కడా పరాకు నీకు
అంతలోనే యేడలేని ఆసలు రేఁచీని

(॥ఇంతి॥)
ముసిముసి నవ్వులు నవ్వి మోవిచవులు చూపి
కనుగాటువలపులు కాంత చల్లీని
ఇసుమంత మాటాడి యెదుటనే నిలుచుండి
కొసరికొసరి నీకొలువు సేసీని

(॥ఇంతి॥)
తప్పక నిన్ను చూచి తగిలి వేమారు మొక్కి
దప్పిదేరఁ గాఁగిటికిఁ దమకించీని
వుప్పతిల్ల సన్నచేసి వొడివట్టి నిన్నుఁ దీసి
కప్పురవులప్ప నీకుఁ గానుకిచ్చీని

(॥ఇంతి॥)
చెలరేఁగి సేవచేసి చేతులు నీపైఁ జాఁచి
వెలసినసంతోసాన విఱ్ఱవీఁగీని
యెలమిశ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
అలమి నిన్నాకె గూడి యరుదఁదీని

(||pallavi||)
iṁti dikku sūḍarādā yĕkkaḍā parāgu nīgu
aṁtalone yeḍaleni āsalu rem̐sīni

(||iṁti||)
musimusi navvulu navvi movisavulu sūbi
kanugāḍuvalabulu kāṁta sallīni
isumaṁta māḍāḍi yĕduḍane nilusuṁḍi
kŏsarigŏsari nīgŏluvu sesīni

(||iṁti||)
tappaga ninnu sūsi tagili vemāru mŏkki
dappideram̐ gām̐giḍigim̐ damagiṁchīni
vuppadilla sannasesi vŏḍivaṭṭi ninnum̐ dīsi
kappuravulappa nīgum̐ gānugichchīni

(||iṁti||)
sĕlarem̐gi sevasesi sedulu nībaim̐ jām̐si
vĕlasinasaṁtosāna viṭravīm̐gīni
yĕlamiśhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
alami ninnāgĕ gūḍi yarudam̐dīni