ఇంతి భాగ్య మిఁక మేమనఁగల దిదె
(॥పల్లవి॥)
ఇంతి భాగ్య మిఁక మేమనఁగల దిదె
సంతస మబ్బెను సరుసనె మీకు
(॥ఇంతి॥)
వీనుల కివివో వెలఁదికిఁ దొడవులు
సోనల నీ నిజసుద్దులును
కానుక లివివో కంటిమి చెలిపై
నానినచూపులు నాయకుఁడా
(॥ఇంతి॥)
వొడలికి నినివో వుంకువలు చెలికి
వెడ నీనవ్వుల వెన్నెలలు
వుడుగర లివివో వొదిగెను నీ చేతి-
బడిబడి సన్నలు పడఁతికి విభుఁడా
(॥ఇంతి॥)
మనసుకు నిదివో మంచినిధానము
అనుగుఁబానుపున నలము రతి
యెనసితి శ్రీ వేంకటేశ యిన్నిటా
చనవిచ్చితి విటు సతికి రమణఁడా
(||pallavi||)
iṁti bhāgya mim̐ka memanam̐gala didĕ
saṁtasa mabbĕnu sarusanĕ mīgu
(||iṁti||)
vīnula kivivo vĕlam̐digim̐ dŏḍavulu
sonala nī nijasuddulunu
kānuga livivo kaṁṭimi sĕlibai
nāninasūbulu nāyagum̐ḍā
(||iṁti||)
vŏḍaligi ninivo vuṁkuvalu sĕligi
vĕḍa nīnavvula vĕnnĕlalu
vuḍugara livivo vŏdigĕnu nī sedi-
baḍibaḍi sannalu paḍam̐tigi vibhum̐ḍā
(||iṁti||)
manasugu nidivo maṁchinidhānamu
anugum̐bānubuna nalamu radi
yĕnasidi śhrī veṁkaḍeśha yinniḍā
sanavichchidi viḍu sadigi ramaṇam̐ḍā