ఇంతేసివారిలోన యెవ్వతె నేను
(॥పల్లవి॥)
ఇంతేసివారిలోన యెవ్వతె నేను
పంతె(త?)గత్తె లుండఁగాను పైకొసరా నేను
(॥ఇంతే॥)
నిన్ను మెచ్చకుందునా నీవు సేసేచేఁతలకు
విన్నవారు నవ్వేరంటా వెఱచి కాక
మన్నించిన నీసతులు మాకంటె ముందరను
సన్నుతించి పొగడేరు చాలదా నీకయ్యా
(॥ఇంతే॥)
దగ్గరక నే నుందునా తగిలేటి నన్నుఁ జూచి
సిగ్గువడ్డదాననై చింతించేఁ గాక
వొగ్గి నీ పొరుగువారు వూరికంటె ముందరను
అగ్గమై కదిసినారు అప్పటినాసతులు
(॥ఇంతే॥)
కొంకు వాపకుందునా కూరిమి నీకాఁగిటను
వంక నీమనసు చూడవలసి కాక
బింకపు శ్రీవేంకటేశ పెనఁగి నన్నుఁ గూడితి-
వింకఁ దొల్లిటి సత్తుల కెట్టు బొంకేమయ్యా
(||pallavi||)
iṁtesivārilona yĕvvadĕ nenu
paṁtĕ(ta?)gattĕ luṁḍam̐gānu paigŏsarā nenu
(||iṁte||)
ninnu mĕchchaguṁdunā nīvu sesesem̐talagu
vinnavāru navveraṁṭā vĕṟasi kāga
manniṁchina nīsadulu māgaṁṭĕ muṁdaranu
sannudiṁchi pŏgaḍeru sāladā nīgayyā
(||iṁte||)
daggaraga ne nuṁdunā tagileḍi nannum̐ jūsi
sigguvaḍḍadānanai siṁtiṁchem̐ gāga
vŏggi nī pŏruguvāru vūrigaṁṭĕ muṁdaranu
aggamai kadisināru appaḍināsadulu
(||iṁte||)
kŏṁku vābaguṁdunā kūrimi nīgām̐giḍanu
vaṁka nīmanasu sūḍavalasi kāga
biṁkabu śhrīveṁkaḍeśha pĕnam̐gi nannum̐ gūḍidi-
viṁkam̐ dŏlliḍi sattula kĕṭṭu bŏṁkemayyā