ఇంతేసి సేవలు సేయ నెందాఁకా నోపుఁ జెలి
(॥పల్లవి॥)
ఇంతేసి సేవలు సేయ నెందాఁకా నోపుఁ జెలి
కాంతుఁడవు మెచ్చి మెచ్చి కాఁగిలించవయ్యా
(॥॥)
పయ్యదకొంగు జారఁగ పాలిండ్లు గదలఁగ
చయ్యన గుంచ వేసీని సతి నీకు
చెయ్యెల్ల బడలంగఁ జెక్కులు చెమరించఁగ
వొయ్యనే పాదాలొత్తీ నుల్లసాన నీకు
(॥॥)
గరిమఁ దురుము వీడఁ గస్తూరి బేంట్లు రాల
పరగఁగ గాళాంజి పట్టీ నీకు
సరులు చిక్కువడఁగ సందడి నూర్పులు రేఁగ
సిరుల గందము వూసీఁ జెలరేగి నీకు
(॥॥)
తనువు పులకించఁగ తమకములు ముంచఁగ
యెనసి యాకు మడిచి యిచ్చీ నీకు
అనుగు శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
చనవునఁ గెమ్మోవి చవిచూపీ నీకు
(||pallavi||)
iṁtesi sevalu seya nĕṁdām̐kā nobum̐ jĕli
kāṁtum̐ḍavu mĕchchi mĕchchi kām̐giliṁchavayyā
(||||)
payyadagŏṁgu jāram̐ga pāliṁḍlu gadalam̐ga
sayyana guṁcha vesīni sadi nīgu
sĕyyĕlla baḍalaṁgam̐ jĕkkulu sĕmariṁcham̐ga
vŏyyane pādālŏttī nullasāna nīgu
(||||)
garimam̐ durumu vīḍam̐ gastūri beṁṭlu rāla
paragam̐ga gāḽāṁji paṭṭī nīgu
sarulu sikkuvaḍam̐ga saṁdaḍi nūrbulu rem̐ga
sirula gaṁdamu vūsīm̐ jĕlaregi nīgu
(||||)
tanuvu pulagiṁcham̐ga tamagamulu muṁcham̐ga
yĕnasi yāgu maḍisi yichchī nīgu
anugu śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
sanavunam̐ gĕmmovi savisūbī nīgu