ఇంతేసి రట్టు గలదా ఇల్లాండ్లకు
(॥పల్లవి॥)
ఇంతేసి రట్టు గలదా ఇల్లాండ్లకు
యెంతైనా గుట్టుతోనే యెనయవలెఁ గాక
(॥ఇంతే॥)
మొగము చూపి చూపి మోహములు వెడరేఁచి
మగనితో నెంతేసి మాఁట లాడేవే
నగి నగి వలపులు నానఁబెట్టి యంతలోనే
పగటున నెంతేసి బయలీఁదించేవే
(॥ఇంతే॥)
చెనకి చెనకి మరి చిగురుఁజేతుల మొక్కి
వినయాన నెందాఁకా వేఁడుకొనేవే
పెనఁగి పెనఁగి సారె బిగువుఁ జన్నుల నొత్తి
కనుమాయలనె యెట్టు గరఁగించేవే
(॥ఇంతే॥)
కొసరి కొసరి వావిఁగొనగోరు సోఁకించి
పసలుగా మే నేల పచ్చిసేసేవే
యెసగ శ్రీవేంకటేశుఁ డిన్నీటాను నన్నుఁగూడె
పొసఁగ నీవేమిటికి పొందులు చూపేనే
(||pallavi||)
iṁtesi raṭṭu galadā illāṁḍlagu
yĕṁtainā guṭṭudone yĕnayavalĕm̐ gāga
(||iṁte||)
mŏgamu sūbi sūbi mohamulu vĕḍarem̐si
maganido nĕṁtesi mām̐ṭa lāḍeve
nagi nagi valabulu nānam̐bĕṭṭi yaṁtalone
pagaḍuna nĕṁtesi bayalīm̐diṁcheve
(||iṁte||)
sĕnagi sĕnagi mari sigurum̐jedula mŏkki
vinayāna nĕṁdām̐kā vem̐ḍugŏneve
pĕnam̐gi pĕnam̐gi sārĕ biguvum̐ jannula nŏtti
kanumāyalanĕ yĕṭṭu garam̐giṁcheve
(||iṁte||)
kŏsari kŏsari vāvim̐gŏnagoru som̐kiṁchi
pasalugā me nela pachchiseseve
yĕsaga śhrīveṁkaḍeśhum̐ ḍinnīḍānu nannum̐gūḍĕ
pŏsam̐ga nīvemiḍigi pŏṁdulu sūbene