ఇంతేసి పొత్తులమాఁట లెందాఁకానే
(॥పల్లవి॥)
ఇంతేసి పొత్తులమాఁట లెందాఁకానే
కాంతుఁడవు నీమేలు గలదాఁకానే
(॥ఇంతే॥)
వోసోసి గొల్లెత యీడ నుండుదునటే
పోసరించి వచ్చి మరి పోనేలరా
ఆసగద్దా లని నిన్ను నడిగితిని, వోరి
దోసము లొకస్తూరి తుంచి వేయవచ్చునా
(॥ఇంతే॥)
వింటివటె నాకు నీవు విందు వెట్టేవా
వెంట నాఁకటికొద్ది నీవే యెఱఁగవా
జంటలనామాఁట నీకు సమ్మతౌనటే
సొంటుల నామతి నీవు సోదించఁగలవా
(॥ఇంతే॥)
కొంకుదేర నిన్ను నిట్టె కూడుదునటే
అంకెకాఁడ నీకు నేను అప్పణిచ్చేనా
యింకానా శ్రీవేంకటేశుఁడఁ గదే
పొంకముగఁ గూడితివి పొనుగఁగ వచ్చునా
(||pallavi||)
iṁtesi pŏttulamām̐ṭa lĕṁdām̐kāne
kāṁtum̐ḍavu nīmelu galadām̐kāne
(||iṁte||)
vososi gŏllĕda yīḍa nuṁḍudunaḍe
posariṁchi vachchi mari ponelarā
āsagaddā lani ninnu naḍigidini, vori
dosamu lŏgastūri tuṁchi veyavachchunā
(||iṁte||)
viṁṭivaḍĕ nāgu nīvu viṁdu vĕṭṭevā
vĕṁṭa nām̐kaḍigŏddi nīve yĕṟam̐gavā
jaṁṭalanāmām̐ṭa nīgu sammadaunaḍe
sŏṁṭula nāmadi nīvu sodiṁcham̐galavā
(||iṁte||)
kŏṁkudera ninnu niṭṭĕ kūḍudunaḍe
aṁkĕgām̐ḍa nīgu nenu appaṇichchenā
yiṁkānā śhrīveṁkaḍeśhum̐ḍam̐ gade
pŏṁkamugam̐ gūḍidivi pŏnugam̐ga vachchunā