Imtesi ninnum gosara nemtadaananu

ఇంతేసి నిన్నుఁ గొసర నెంతదానను
Language

(॥పల్లవి॥)
ఇంతేసి నిన్నుఁ గొసర నెంతదానను
అంతా నీవద్ది చెలుల నడుగరాదా

(॥ఇంతే॥)
యెన్న నీతో మాటాడేది యెంతటిది గావలె
నిన్ను నొడఁబరచఁగ నే నేర్తునా
యెన్నికతో నీవు తొల్లి యిచ్చిన నమ్మిక లివి
అన్నియుఁ జెలుల నీవే అడుగఁగరాదా

(॥ఇంతే॥)
యెదిరించి దీకొనగ నెంత గుండెది గావలె
వదలక మట్టు పెట్ట వసమా నిన్ను
మొదలఁ బెండ్లాడేనాటి మోహపు చేఁత లవి
అదె సాకిరిచెలుల నడుగఁగరాదా

(॥ఇంతే॥)
యిచ్చకములాడ నీకు నెటువంటిది గావలె
పచ్చిసేసి తడవఁగఁ బంతకత్తెనా
యిచ్చలు శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు
అచ్చపుచెలులఁ దిగ వడుగఁగరాదా

(||pallavi||)
iṁtesi ninnum̐ gŏsara nĕṁtadānanu
aṁtā nīvaddi sĕlula naḍugarādā

(||iṁte||)
yĕnna nīdo māḍāḍedi yĕṁtaḍidi gāvalĕ
ninnu nŏḍam̐barasam̐ga ne nerdunā
yĕnnigado nīvu tŏlli yichchina nammiga livi
anniyum̐ jĕlula nīve aḍugam̐garādā

(||iṁte||)
yĕdiriṁchi dīgŏnaga nĕṁta guṁḍĕdi gāvalĕ
vadalaga maṭṭu pĕṭṭa vasamā ninnu
mŏdalam̐ bĕṁḍlāḍenāḍi mohabu sem̐ta lavi
adĕ sāgirisĕlula naḍugam̐garādā

(||iṁte||)
yichchagamulāḍa nīgu nĕḍuvaṁṭidi gāvalĕ
pachchisesi taḍavam̐gam̐ baṁtagattĕnā
yichchalu śhrīveṁkaḍeśha yelidivi nannu nīvu
achchabusĕlulam̐ diga vaḍugam̐garādā