Imtesi nerudumaa ne millaamdlamu

ఇంతేసి నేరుతుమా నే మిల్లాండ్లము
Language

(॥పల్లవి॥)
ఇంతేసి నేరుతుమా నే మిల్లాండ్లము
సంతోసాన వారి నన్నూ సరిగాఁ జూచేవు

(॥ఇంతే॥)
కన్నుల నవ్వఁగఁదగు కడుఁజేఁతలాడికి
చన్నుల నొత్తఁగఁదగుఁ జలపాదికి
విన్నపాలు సేయఁదగు వెస మాటకారికి
సన్నలు సేయఁగఁదగు చనవరిదానికి

(॥ఇంతే॥)
సిగ్గులు వడఁగఁదగు చిన్ని పెండ్లికూఁతురుకు
దగ్గరి వుండఁగఁదగు దంటదానికి
వెగ్గళించి నవ్వఁదగు వెఱపులేనియింతికి
వొగ్గి చెనకఁగఁదగు నుదుటైనదానికి

(॥ఇంతే॥)
పెనఁగి పిలువఁదగు బీరపుతరుణికి
పనిగొని కూడఁదగు పంతగత్తెకు
నిను శ్రీవేంకటేశ్వర నే నలమేలుమంగను
యెనసితి నాకు దగు నిచ్చకపుదానికి

(||pallavi||)
iṁtesi nerudumā ne millāṁḍlamu
saṁtosāna vāri nannū sarigām̐ jūsevu

(||iṁte||)
kannula navvam̐gam̐dagu kaḍum̐jem̐talāḍigi
sannula nŏttam̐gam̐dagum̐ jalabādigi
vinnabālu seyam̐dagu vĕsa māḍagārigi
sannalu seyam̐gam̐dagu sanavaridānigi

(||iṁte||)
siggulu vaḍam̐gam̐dagu sinni pĕṁḍligūm̐turugu
daggari vuṁḍam̐gam̐dagu daṁṭadānigi
vĕggaḽiṁchi navvam̐dagu vĕṟabuleniyiṁtigi
vŏggi sĕnagam̐gam̐dagu nuduḍainadānigi

(||iṁte||)
pĕnam̐gi piluvam̐dagu bīrabudaruṇigi
panigŏni kūḍam̐dagu paṁtagattĕgu
ninu śhrīveṁkaḍeśhvara ne nalamelumaṁganu
yĕnasidi nāgu dagu nichchagabudānigi