ఇంతేసి మీ గుట్టు లెవ్వ డెఱుఁగు
(॥పల్లవి॥)
ఇంతేసి మీ గుట్టు లెవ్వ డెఱుఁగు
వింతలాయ నేఁడు వివరించగాను
(॥॥)
చల్లని చూపుల నీవు సారెఁ దన్నుఁ జూడఁగాను
మెల్లని మాటల నాపె మెచ్చనాడఁగా
యెల్లవారు నెరిఁగిరి యిద్దరి మీ పొందులు
కల్లలంటా నుంటిమి యీకత లిన్నాళ్లదాఁకా
(॥॥)
చెలరేఁగి నీవు నట్టె చేసన్నలు సేయఁగాను
నలువంకలను నాపె నవ్వఁగాను
తెలిసి రిందరు నేఁడు తేటతెల్లమిగాను
బెళుకులంటా నుంటిమి ప్రియము లిందాఁకాను
(॥॥)
శ్రీ వేంకటేశ నీవు చేకొని కూడఁగాను
కావరించి పయ్యదాపె గప్పఁగాను
యీవల మమ్మేలితిరి ఇంతులు సంతోసించిరి
ఆవలపులే సతమనుచు నేముంటిమి
(||pallavi||)
iṁtesi mī guṭṭu lĕvva ḍĕṟum̐gu
viṁtalāya nem̐ḍu vivariṁchagānu
(||||)
sallani sūbula nīvu sārĕm̐ dannum̐ jūḍam̐gānu
mĕllani māḍala nābĕ mĕchchanāḍam̐gā
yĕllavāru nĕrim̐giri yiddari mī pŏṁdulu
kallalaṁṭā nuṁṭimi yīgada linnāḽladām̐kā
(||||)
sĕlarem̐gi nīvu naṭṭĕ sesannalu seyam̐gānu
naluvaṁkalanu nābĕ navvam̐gānu
tĕlisi riṁdaru nem̐ḍu teḍadĕllamigānu
bĕḽugulaṁṭā nuṁṭimi priyamu liṁdām̐kānu
(||||)
śhrī veṁkaḍeśha nīvu segŏni kūḍam̐gānu
kāvariṁchi payyadābĕ gappam̐gānu
yīvala mammelidiri iṁtulu saṁtosiṁchiri
āvalabule sadamanusu nemuṁṭimi