Imtesi maayalu padi yerumguno yeramgamdo

ఇంతేసి మాయలు పతి యెరుఁగునో యెరఁగఁడో
Language

(॥పల్లవి॥)
ఇంతేసి మాయలు పతి యెరుఁగునో యెరఁగఁడో
చింత దీర నాతనితోఁ జెప్పరమ్మ చెలులు

(॥ఇంతేసి॥)
దగ్గరి యాతనితో నే తమితో మాట లాడితే
ఆగ్గలపుసతులు గయ్యాళి యందురూ
సిగ్గు పడి వూర కున్న చెంగలించి వెంగెముల
నిగ్గుల ని దేమియు నేర దందు రూ

(॥ఇంతేసి॥)
నయమున నేఁ గొంత నవ్వులు నవ్వఁగఁ బోతే
బయకారా లని వారే పచ్చి వేతురు
దయతోడ గుట్టు సేసి తల వంచుకొని వుంటే
నియతి నలిగె నంటా నెట్టన గడింతులు

(॥ఇంతేసి॥)
కతగా శ్రీవెంకటేశుఁ గలసి మెప్పించితేను
రతులలో ని దెంతటి రాఁగ యందురూ
యిత వై యీతఁడు నన్న నింతగా మన్నించి కూడె
మతక మింతయును నామర్మమే యందురూ

(||pallavi||)
iṁtesi māyalu padi yĕrum̐guno yĕram̐gam̐ḍo
siṁta dīra nādanidom̐ jĕpparamma sĕlulu

(||iṁtesi||)
daggari yādanido ne tamido māḍa lāḍide
āggalabusadulu gayyāḽi yaṁdurū
siggu paḍi vūra kunna sĕṁgaliṁchi vĕṁgĕmula
niggula ni demiyu nera daṁdu rū

(||iṁtesi||)
nayamuna nem̐ gŏṁta navvulu navvam̐gam̐ bode
bayagārā lani vāre pachchi veduru
dayadoḍa guṭṭu sesi tala vaṁchugŏni vuṁṭe
niyadi naligĕ naṁṭā nĕṭṭana gaḍiṁtulu

(||iṁtesi||)
kadagā śhrīvĕṁkaḍeśhum̐ galasi mĕppiṁchidenu
radulalo ni dĕṁtaḍi rām̐ga yaṁdurū
yida vai yīdam̐ḍu nanna niṁtagā manniṁchi kūḍĕ
madaga miṁtayunu nāmarmame yaṁdurū