ఇంతేసి కొయ్యతనాలు యేఁటికి నీకు
(॥పల్లవి॥)
ఇంతేసి కొయ్యతనాలు యేఁటికి నీకు
సంతము గావలెఁ గాక చలపట్టవచ్చునా
(॥॥)
చనవరితనమున సతి నీతోఁ బెనఁగఁగ
యెనలేనిపంతమున నేలతిట్టేవు
మనసిచ్చి యాపె నిన్ను మారుకు మారాడితేను
వినవలెఁగాక నీకు వెగ్గళించవచ్చునా
(॥॥)
నవ్వుచేసుకొని నీపై నాతి చేతులు చాఁచఁగా
పువ్వులచెండుననేల పూఁచివేసేవు
చివ్వన నాకె నిన్ను చేఁతకుఁజేఁత సేసితే
నివ్వటిల్లవలెంగాక నేరమెంచవచ్చునా
(॥॥)
కలపకోలున నిన్ను కాంత గాఁగిలించగాను
అలయించి యాపె నెంత యాసరేఁచేవు
అలరి శ్రీ వేంకటేశ ఆపెనిన్నుఁ గొసరితే
చెలరేగఁవచ్చుగాక సిగ్గువడవచ్చునా
(||pallavi||)
iṁtesi kŏyyadanālu yem̐ṭigi nīgu
saṁtamu gāvalĕm̐ gāga salabaṭṭavachchunā
(||||)
sanavaridanamuna sadi nīdom̐ bĕnam̐gam̐ga
yĕnalenibaṁtamuna neladiṭṭevu
manasichchi yābĕ ninnu mārugu mārāḍidenu
vinavalĕm̐gāga nīgu vĕggaḽiṁchavachchunā
(||||)
navvusesugŏni nībai nādi sedulu sām̐sam̐gā
puvvulasĕṁḍunanela pūm̐sivesevu
sivvana nāgĕ ninnu sem̐tagum̐jem̐ta seside
nivvaḍillavalĕṁgāga neramĕṁchavachchunā
(||||)
kalabagoluna ninnu kāṁta gām̐giliṁchagānu
alayiṁchi yābĕ nĕṁta yāsarem̐sevu
alari śhrī veṁkaḍeśha ābĕninnum̐ gŏsaride
sĕlaregam̐vachchugāga sigguvaḍavachchunā