Imtesi kaagu sesee nemi sedune

ఇంతేసి కాకు సేసీ నేమి సేతునే
Language

(॥పల్లవి॥)
ఇంతేసి కాకు సేసీ నేమి సేతునే
కాంతలఁ దమి రేఁచీని కడు సాదా వీఁడు

(॥ఇంతేసి॥)
కొచ్చినా బొడ్డు దమ్మీని గుంతపోఁక లాడే నంటా
పచ్చావి వేఁడుకొనీని బాలుఁడా వీఁడు
రచ్చ నా చన్నులు బొమ్మరాలు తా నాడే నంటా
పెచ్చురేఁగి కొంగు వట్టీ పిన్నవాఁడా వీఁడు

(॥ఇంతేసి॥)
అరసి నా పిరుఁ దిది ఆడే చక్రపు బి ల్లంటా
సరఁస బట్టి నిమ్మనీ సన్నమా వీఁడు
గరిమఁ దొడలు ముట్టి కంబాలాట లాడే నంటా
పరగ నొడఁబరచీ పడుచా వీఁడు

(॥ఇంతేసి॥)
అలరి నా కౌఁగిట నప్పలప్పలాడే నంటా
పిలిచి కూడీని పిన్నబిడ్డ డా వీఁడు
అలమిశ్రీవేంకటేశుఁ డాలిమగనాట లంటా
చెలరే గి మోవెడిగీ చిఱుతా వీఁడు

(||pallavi||)
iṁtesi kāgu sesī nemi sedune
kāṁtalam̐ dami rem̐sīni kaḍu sādā vīm̐ḍu

(||iṁtesi||)
kŏchchinā bŏḍḍu dammīni guṁtabom̐ka lāḍe naṁṭā
pachchāvi vem̐ḍugŏnīni bālum̐ḍā vīm̐ḍu
rachcha nā sannulu bŏmmarālu tā nāḍe naṁṭā
pĕchchurem̐gi kŏṁgu vaṭṭī pinnavām̐ḍā vīm̐ḍu

(||iṁtesi||)
arasi nā pirum̐ didi āḍe sakrabu bi llaṁṭā
saram̐sa baṭṭi nimmanī sannamā vīm̐ḍu
garimam̐ dŏḍalu muṭṭi kaṁbālāḍa lāḍe naṁṭā
paraga nŏḍam̐barasī paḍusā vīm̐ḍu

(||iṁtesi||)
alari nā kaum̐giḍa nappalappalāḍe naṁṭā
pilisi kūḍīni pinnabiḍḍa ḍā vīm̐ḍu
alamiśhrīveṁkaḍeśhum̐ ḍālimaganāḍa laṁṭā
sĕlare gi movĕḍigī siṟudā vīm̐ḍu