Imtesi dorabomdu yemdugu nainaa vachchu

ఇంతేసి దొరపొందు యెందుకు నైనా వచ్చు
Language

(॥పల్లవి॥)
ఇంతేసి దొరపొందు యెందుకు నైనా వచ్చు
చింత దీర నా మనసు చెలఁగించవయ్యా

(॥ఇంతేసి॥)
పలుమారు నీతోను పలచఁగా నే నవ్వితే
యెలమి నీ చిత్త మిఁక నెట్టుండునో
పిలువఁగ నీతోను బిగిసి వూరకుండితే
అలరి కైకొనని అదియు నెట్టుండునో

(॥ఇంతేసి॥)
పిక్కటిల్ల నీతోను బెరసి మాటలాడితే
యెక్కువ తక్కువలందు నెట్టుండునో
వక్కణించగా నీతో వడి గుట్టున నుండితే
అక్కజపు గర్వమని అదియు నెట్టుండునో

(॥ఇంతేసి॥)
కదియఁగ నీతోను కడు నేఁ గొసరితేను
ఇదె శ్రీవెంకటేశ నేఁ డెట్టుండునో
పొదిగి కూడితి వింకఁ బూఁచి సిగ్గు వడితేను
అదను గా దని సంత మదియు నెట్టుండునో

(||pallavi||)
iṁtesi dŏrabŏṁdu yĕṁdugu nainā vachchu
siṁta dīra nā manasu sĕlam̐giṁchavayyā

(||iṁtesi||)
palumāru nīdonu palasam̐gā ne navvide
yĕlami nī sitta mim̐ka nĕṭṭuṁḍuno
piluvam̐ga nīdonu bigisi vūraguṁḍide
alari kaigŏnani adiyu nĕṭṭuṁḍuno

(||iṁtesi||)
pikkaḍilla nīdonu bĕrasi māḍalāḍide
yĕkkuva takkuvalaṁdu nĕṭṭuṁḍuno
vakkaṇiṁchagā nīdo vaḍi guṭṭuna nuṁḍide
akkajabu garvamani adiyu nĕṭṭuṁḍuno

(||iṁtesi||)
kadiyam̐ga nīdonu kaḍu nem̐ gŏsaridenu
idĕ śhrīvĕṁkaḍeśha nem̐ ḍĕṭṭuṁḍuno
pŏdigi kūḍidi viṁkam̐ būm̐si siggu vaḍidenu
adanu gā dani saṁta madiyu nĕṭṭuṁḍuno