ఇంతేకాని తెలిసితే నెవ్వరూఁ గర్తలు గారు
(॥పల్లవి॥)
ఇంతేకాని తెలిసితే నెవ్వరూఁ గర్తలు గారు
బంతినే వీని కెప్పుడుఁ బ్రకృతి గారణము
(॥ఇంతే॥)
యివిగో గుణాలు మూఁడే యింద్రియాలఁ గూడుకొని
భువిఁ బ్రాణులనెల్లాను పూఁచి పనులుగొనేవి
కవిసి కర్మములై ఘనలోకాలఁ దిప్పేవి
ఆవలఁ బుట్టుగులకు నప్పటిఁ దెచ్చేవి
(॥ఇంతే॥)
పంచభూతా లివియే పరగ జీవులకెల్లా
దించరాక యెప్పుడును దేహాలయ్యేవి
అంచెలఁ గంచములోఁ బదార్థములై వుండినవి
తెంచరాని పాశములై తీపులఁ బెట్టేవి
(॥ఇంతే॥)
మనసొక్కటే జంతుల మర్మములు రేఁచేది
తనుభోగములలోనఁ దనివిచ్చేది
అనయము శ్రీవేంకటాధిప నీ మహి మిది
నినుఁ గొల్చిన దాసుల నెరవేర్చేది
(||pallavi||)
iṁtegāni tĕliside nĕvvarūm̐ gardalu gāru
baṁtine vīni kĕppuḍum̐ brakṛti gāraṇamu
(||iṁte||)
yivigo guṇālu mūm̐ḍe yiṁdriyālam̐ gūḍugŏni
bhuvim̐ brāṇulanĕllānu pūm̐si panulugŏnevi
kavisi karmamulai ghanalogālam̐ dippevi
āvalam̐ buṭṭugulagu nappaḍim̐ dĕchchevi
(||iṁte||)
paṁchabhūdā liviye paraga jīvulagĕllā
diṁcharāga yĕppuḍunu dehālayyevi
aṁchĕlam̐ gaṁchamulom̐ badārdhamulai vuṁḍinavi
tĕṁcharāni pāśhamulai tībulam̐ bĕṭṭevi
(||iṁte||)
manasŏkkaḍe jaṁtula marmamulu rem̐sedi
tanubhogamulalonam̐ danivichchedi
anayamu śhrīveṁkaḍādhiba nī mahi midi
ninum̐ gŏlsina dāsula nĕraversedi