ఇంతేకా నీ జాణతన మెన్నాళ్ళకు
(॥పల్లవి॥)
ఇంతేకా నీ జాణతన మెన్నాళ్ళకు
కాంతుఁడ నీ గుణమెల్లఁ గంటిమి యిన్నాళ్లకు
(॥ఇంతే॥)
మెల్లనె యేకతాన నే మేనవావి చెప్పితేను
చల్లి చల్లి వూర నెల్లఁ జాటేవు
గొల్లజాణతన మెల్ల కోరి నీయందే కంటి
పెల్లుగాఁ బదారువేల పెండ్లెట్లా నాడితివో
(॥ఇంతే॥)
కందువలు చూపి నీకుఁ గనుసన్న సేసితేను
అంది బెట్టిమాటల నేల అడిగేవు
పొంది సేయలఁ గాచిన బుద్ది నీకు నేల పోవు
యిందునే పాండవులు నిన్నేల పూజ సేసిరో
(॥ఇంతే॥)
గరిమే శ్రీ వేంకటేశ కాఁగిట నేఁబట్టితేను
కెరలి నాకెంతో నీవు కిందువడేవు
పెరిగినరేపల్లెబిరు దెల్లఁ గానవచ్చె
పురుషోత్తముఁడ వని పొగడేరు జనులు
(||pallavi||)
iṁtegā nī jāṇadana mĕnnāḽḽagu
kāṁtum̐ḍa nī guṇamĕllam̐ gaṁṭimi yinnāḽlagu
(||iṁte||)
mĕllanĕ yegadāna ne menavāvi sĕppidenu
salli salli vūra nĕllam̐ jāḍevu
gŏllajāṇadana mĕlla kori nīyaṁde kaṁṭi
pĕllugām̐ badāruvela pĕṁḍlĕṭlā nāḍidivo
(||iṁte||)
kaṁduvalu sūbi nīgum̐ ganusanna sesidenu
aṁdi bĕṭṭimāḍala nela aḍigevu
pŏṁdi seyalam̐ gāsina buddi nīgu nela povu
yiṁdune pāṁḍavulu ninnela pūja sesiro
(||iṁte||)
garime śhrī veṁkaḍeśha kām̐giḍa nem̐baṭṭidenu
kĕrali nāgĕṁto nīvu kiṁduvaḍevu
pĕriginareballĕbiru dĕllam̐ gānavachchĕ
puruṣhottamum̐ḍa vani pŏgaḍeru janulu