(॥పల్లవి॥)
ఇంతేపో కలిగినది యే కాలము
కంతుఁడు సేసిన మాయ కలకాలము
(॥ఇంతే॥)
కాటుక నీ కన్నుచూపు కలికిపైఁ జల్లితేనే
గాటము విభునికి జీఁకటికాలము
పొటపొట నవ్వు మోవిఁ బాడ నటు నవ్వితేను
నీటున నీపతికి వెన్నెలకాలము
(॥ఇంతే॥)
కాంత పొలయలుకఁ గాఁక లటు చిమ్మితేను
సంతమైన ప్రియునికి వేసవికాలము
అంతలో రమణుని నీ వాదరించి దగ్గరిన
వంతల నీ చెమటల వానకాలమూ
(॥ఇంతే॥)
రతుల శ్రీవేంకటేశు రమణి నీ వుండితే
మితిలేని జవ్వనపు మేలుగాలము
సతి నీ మోవితేనె చవి చూపితేనే స
మ్మతుల నాతనికి నామనికాలమూ
(||pallavi||)
iṁtebo kaliginadi ye kālamu
kaṁtum̐ḍu sesina māya kalagālamu
(||iṁte||)
kāḍuga nī kannusūbu kaligibaim̐ jallidene
gāḍamu vibhunigi jīm̐kaḍigālamu
pŏḍabŏḍa navvu movim̐ bāḍa naḍu navvidenu
nīḍuna nībadigi vĕnnĕlagālamu
(||iṁte||)
kāṁta pŏlayalugam̐ gām̐ka laḍu simmidenu
saṁtamaina priyunigi vesavigālamu
aṁtalo ramaṇuni nī vādariṁchi daggarina
vaṁtala nī sĕmaḍala vānagālamū
(||iṁte||)
radula śhrīveṁkaḍeśhu ramaṇi nī vuṁḍide
midileni javvanabu melugālamu
sadi nī movidenĕ savi sūbidene sa
mmadula nādanigi nāmanigālamū