ఇంతే పో యెడమాట లిఁకనేఁటికి । తా
(॥పల్లవి॥)
ఇంతే పో యెడమాట లిఁకనేఁటికి । తా-
నంతే వంగళమైతే నంతకంటె నేను
(॥ఇంతే ॥)
వొయ్యారములతనవొప్పు చూచే తనిసితి -
నయ్యో నిం కానేలే ఆసుద్దులు
గయ్యాళియై తనకన్నులనే మొక్కితేను
వెయ్యేసి మతిలో దీవించితినే నేను
(॥ఇంతే॥)
నానాగతులు తననవ్వులలోనే తనిసితి
ఔనే యింకానేలే ఆసుద్దులు
తానే ముచ్చటమాట తలఁపులోఁ బాదుకొంటే
మోనాన నూఁ కొంటి మొదలనే నేను
(॥ఇంతే॥)
గద్దరికోపము తనకాఁగిటనే మఱచితి-
నద్దివో యింకానేల యాసుద్దులు
వొద్దనే శ్రీవేంకటేశు- డూరడించి యిచ్చీ మోవి
చద్దివేఁడి కింక నిట్టె చవిగొంటి నేను
(||pallavi||)
iṁte po yĕḍamāḍa lim̐kanem̐ṭigi | tā-
naṁte vaṁgaḽamaide naṁtagaṁṭĕ nenu
(||iṁte ||)
vŏyyāramuladanavŏppu sūse tanisidi -
nayyo niṁ kānele āsuddulu
gayyāḽiyai tanagannulane mŏkkidenu
vĕyyesi madilo dīviṁchidine nenu
(||iṁte||)
nānāgadulu tananavvulalone tanisidi
aune yiṁkānele āsuddulu
tāne muchchaḍamāḍa talam̐pulom̐ bādugŏṁṭe
monāna nūm̐ kŏṁṭi mŏdalane nenu
(||iṁte||)
gaddarigobamu tanagām̐giḍane maṟasidi-
naddivo yiṁkānela yāsuddulu
vŏddane śhrīveṁkaḍeśhu- ḍūraḍiṁchi yichchī movi
saddivem̐ḍi kiṁka niṭṭĕ savigŏṁṭi nenu