(॥పల్లవి॥)
ఇంతే పో వల పిందరికి
దొంతల వింతల రంతులును
(॥ఇంతే॥)
చిత్తపు టీతఁలు చిడిముడి సేఁతలు
పొత్తుల తమ తల పోఁతలును
మెత్తని యధరపు మేఁతలు లోలో
కుత్తికెఁ గులికెడి కూఁతలును,
(॥ఇంతే॥)
చూపుల తీపులు సొక్కుల పులకలు
దాపుల తమతమ తమకములు
కోపపు కిసరులు కూటపు కొసరులు
ఏపున విరహపు టెసరులును
(॥ఇంతే॥)
పువ్వుల వాట్లు వున్నమ చాట్లు
నవ్వుల పృదయపు నాట్లును
రవ్వగు వేంకటరమణునిఁ గలిసిన
యివ్వల మరువం పేట్లును
(||pallavi||)
iṁte po vala piṁdarigi
dŏṁtala viṁtala raṁtulunu
(||iṁte||)
sittabu ṭīdam̐lu siḍimuḍi sem̐talu
pŏttula tama tala pom̐talunu
mĕttani yadharabu mem̐talu lolo
kuttigĕm̐ guligĕḍi kūm̐talunu,
(||iṁte||)
sūbula tībulu sŏkkula pulagalu
dābula tamadama tamagamulu
kobabu kisarulu kūḍabu kŏsarulu
ebuna virahabu ṭĕsarulunu
(||iṁte||)
puvvula vāṭlu vunnama sāṭlu
navvula pṛdayabu nāṭlunu
ravvagu veṁkaḍaramaṇunim̐ galisina
yivvala maruvaṁ peṭlunu